హర్ష నూతన ఇంటి గృహప్రవేశం...హాజరైన సాయి ధరమ్ తేజ్
యూట్యూబర్ గా, షార్ట్ ఫిలిం మేకర్ గా , నటుడిగా,సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష చెముడు నూతన గృహ ప్రవేశం చేశాడు. ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ చేస్తో ఫుల్ బిజీ ఐపోయాడు. రవితేజ ప్రొడ్యూసర్ గా రూపుదిద్దుకుంటున్న "సుందరం మాస్టర్" అనే మూవీలో హీరోగా చేస్తున్నాడు వైవా హర్ష. రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న హర్ష ఇప్పుడు సొంతింట్లోకి కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ గృహప్రవేశానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేసి విష్ చేసాడు. హర్ష, సాయిధరమ్ తేజ్ మంచి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ , ఇండస్ట్రీ పెద్దలు, హర్ష అభిమానులు అందరూ కూడా అభినందనలు చెప్తున్నారు.