English | Telugu
రిషికి ఏంజిల్ ఇచ్చే సర్ ప్రైజ్ ఏంటి.. శైలేంద్ర ప్లాన్ అదేనా!
Updated : Aug 27, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -852 లో.. జగతి, మహేంద్ర ఇంట్లో వాళ్లంత భోజనం చేస్తుంటారు. కూరలో ఉప్పు ఎక్కువ వేసావని ధరణిపై దేవయాని కోప్పడుతుంది. అక్కడే ఉన్న శైలేంద్ర గమినించి, ఫణింద్ర దృష్టిలో మంచివాడనిపించుకోవాలని కర్రీ బాగుంది మమ్మీ నువ్వు అలా అనకు.. ఈ కర్రీ నా కోసం చేసావా చాలా బాగుందని ధరణితో శైలేంద్ర చెప్తాడు. ధరణి ఆశ్చర్యంగా చూస్తుంది. సరదాగా ప్రేమగా మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉంటావేంటని శైలేంద్ర అంటాడు. మీకోసమే చేశానని ధరణి చెప్తుంది.
ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి ముందు తెలుసుకుంటానని ఫణింద్రకి శైలేంద్ర చెప్తాడు. దానికి సరేనంటాడు ఫణింద్ర. మరొక వైపు ఏంటి ఏదో మాట్లాడాలని అన్నావని ఏంజిల్ ని వసుధార అడుగుతుంది. రిషి ఎందుకో డల్ గా ఉన్నాడు. నువ్వు రాసిన లెటర్ తనకి కన్పించేలా పెట్టాను చూసి ఉంటాడా ఎలాంటి రియాక్షన్ లేదని వసుధారతో ఏంజిల్ అంటుంది. ఆ లెటర్ చూడలేదు అనుకుంటా అని వసుధార అనగానే.. చూసాడు చూసేలా పెట్టానని ఏంజిల్ చెప్తుంది. అసలు రిషి ఇంతక ముందు ఎవరినైనా ప్రేమించాడేమో అని ఏంజిల్ అంటుంది. నిన్ను ఒకటి అడగాలా అని ఏంజిల్ వసుధారని అంటుంది. నువ్వు రిషిని ప్రేమించావా? లేక నిన్ను రిషి ప్రేమించాడా? ఇద్దరు ప్రేమించుకుంటున్నారా... మీ మధ్య ఏదైనా గతమేమైనా ఉందా అని ఏంజిల్ అడుగుతుంది. అదేం లేదు లెక్చరర్ కి లెక్చరర్ కి మధ్య ఏముంటుంది.. ఏం లేదని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని ఏంజిల్ రిలాక్స్ అవుతుంది. మరొక వైపు శైలేంద్ర కాలేజీలో మేనేజర్ తో మాట్లాడుతాడు. అది చూసిన జగతి, మహేంద్ర ఇద్దరు మేనేజర్ ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాడని అనుకుంటారు. శైలేంద్ర దగ్గరికి జగతి మహేంద్ర ఇద్దరు వచ్చి.. ఏం తెలుసుకుంటున్నారని అడుగుతాడు. అప్పుడే ఫణింద్ర వస్తాడు. ఏమైందని అడుగుతాడు. మీరు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ విషయాలు తెలుసుకోమన్నారు కదా తెలుసుకుంటుంటే.. పిన్ని, బాబాయ్ ఇద్దరు వచ్చి ఏం అడుగుతున్నావని అంటున్నారని శైలేంద్ర చెప్తాడు. ఇది వరకు శైలేంద్ర అలా మాట్లాడాడు కానీ ఇప్పుడు నేర్చుకోనివ్వండని ఫణింద్ర చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా ఇదే టాపిక్ గురించి ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటారు.
మరొక వైపు రిషిపై ఉన్న ప్రేమ వసుధార గురించి గుర్తు చేసుకుంటుంది. ఏంజిల్ ఎప్పుడు లేనివిధంగా అందంగా రెడీ అవుతుంది. అప్పుడే రిషి వస్తాడు. రిషి నీతో మాట్లాడాలి, నీకొక సర్ ప్రైజ్ ఉందని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.