English | Telugu

అగ్రిమెంట్ పూర్తయిందని చెప్పిన కృష్ణ.. రేవతి ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -246 లో.. మురారికి కృష్ణ తినిపిస్తూ తనకి దగ్గరగా ఉంటుంది. కృష్ణ చూపించే ప్రేమకి మురారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనని నడిపిస్తూ మురారి పక్కనే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కృష్ణ అని మురారి మనసులో అనుకుంటాడు.

ఆ తర్వాత కృష్ణ కొద్ది దూరాన నిల్చొని.. మీరు మెల్లి మెల్లిగా నా దగ్గరికి రండి అని మురారిని నడవమని చెప్తుంది. మురారి దగ్గరగా వెళ్లిన కొద్ది కృష్ణ వెనక్కి జరుగుతుంది. ఈ ఆట కూడా నా జీవితం లాగే ఉంది కృష్ణ.. నేను నీకు దగ్గరగా వస్తుంటే నువ్వు దూరంగా వెళ్తున్నావని మురారి మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత మురారి నడవడంలో ఎంకరేజ్ చెయ్యడానికి కృష్ణ కో డాక్టర్స్, కాని స్టేబుల్స్ వస్తారు. అప్పుడే రేవతి క్యాంపు దగ్గరికి వస్తుంది. మురారిని ఆ సిచువేషన్ లో చూసిన రేవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైంది మురారి అంటూ బాధపడుతు వస్తుంది. ఒక డాక్టర్ జరిగిందంతా రేవతికి చెప్తుంది. మీరేం టెన్షన్ పడకండని రేవతికి కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ మురారిలది అగ్రిమెంట్ గడువు ఈ రోజుకే లాస్ట్ అని కృష్ణ బాధపడుతుంది. మురారి దగ్గరే కృష్ణ రేవతి ఉంటారు. మురారిని ఈ సిచువేషన్ లో చూస్తున్నందుకు బాధగా ఉందని రేవతి అంటుంది. మా అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తి అవుతుందని అత్తయ్యకి చెప్పాలని కృష్ణ అనుకొని.. అత్తయ్య మీతో మాట్లాడాలని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీకో విషయం చెప్పాలని కృష్ణ ఇబ్బంది పడుతుంటుంది. అగ్రిమెంట్ గురించి అని కృష్ణ అనగానే.. ఇంకా మర్చిపోలేదా.. అగ్రిమెంట్ లేదు, ఏం లేదు నేను ఉన్న కోపంలో నువ్వు అగ్రిమెంట్ అంటూ మాట్లాడితే చెంప చెళ్లుమనిపిస్తానని కృష్ణకి రేవతి వార్నింగ్ ఇస్తుంది. నాకు వెళ్ళాలని లేదు అత్తయ్య కానీ మీ అబ్బాయి మనసులో నేను లేనని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఈ రోజుతో నా అగ్రిమెంట్ పూర్తి అవుతుంది. నేను రేపు మా ఊరు వెళ్తున్నానని కృష్ణ చెప్పి వెళ్తుంది. మీ ఊరు వెళ్తే నేను రాలేనా వచ్చి నిన్ను తీసుకువస్తానని రేవతి అనుకుంటుంది.

మరొక వైపు కృష్ణని పిలుస్తు మురారి వస్తాడు. కృష్ణ ఎక్కడ అని రేవతిని మురారి అడుగుతాడు. రేవతి పట్టించుకోనట్లు టిఫిన్ తీసుకొని రావాలా అని అడుగుతుంది. అమ్మా నేనేం అంటున్నాను, నువ్వేం అంటున్నావని మురారి అంటాడు. కృష్ణ అగ్రిమెంట్ పూర్తయిందట కదా, అందుకే ఊరు వెళ్తుందట అని రేవతి చెప్పగానే.. నీ కొడుకు భార్య అలా వెళ్ళిపోతే, నా కొడుకుని వదిలిపెట్టి వెళ్తున్నావ్ ఎందుకు అని నువ్వు అడగవా అని మురారి అంటాడు. మీకు ఒకరిపై ఒకరికి ఇష్టం లేనప్పుడు నేనెందుకు అడుగుతానని రేవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.