డోంట్ టాక్ టు మీ నవీన్... ఎలా కనిపిస్తున్నా నేను నీకు!
సుమ అడ్డా షో స్టేజి మీద ఈ వారం ఎపిసోడ్ ఫుల్ నవ్వు తెప్పించేసింది. ఈ షోకి నవీన్ పోలిశెట్టి, మహేష్ ఆచంట, ఆరియానా, శివజ్యోతి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ దగ్గరకు ఆరియానా వచ్చి "ఏంటి ఇన్ని నెమళ్ళు ఉన్నాయి నీ డ్రెస్ మీద" అని అడిగింది. "నాట్యం చేస్తాయి ఏం వెళ్తావా నువ్వు" అన్నాడు మహేష్ ఆచంట కామెడీగా. " నవీన్ నాకు కూడా ఒక అబ్బాయిని చూసి పెట్టొచ్చుగా" అని అడిగింది ఆరియానా "ఒరేయ్ ప్లీజ్ నాకు పెళ్లయిపోయింది.. నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని మహేష్ ఆన్సర్ ఇచ్చాడు.