English | Telugu
Shivaji : సంఛాలక్ గా శోభా శెట్టి ఫెయిల్.. ప్రియాంక కోసం శివాజీతో గొడవ!
Updated : Nov 17, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో సీరియల్ బ్యాచ్ కి శివాజీకి మధ్య ఆర్గుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు టాస్క్, మరోవైపు కంటెస్టెంట్స్ స్ట్రాటజీలతో బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. హౌస్ లో గతవారం ఫ్యామిలీ వీక్ సాగగా.. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్.
గతవారం ఫ్యామిలీ వీక్ లో సీరియల్ బ్యాచ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు.. ఎవరి గేమ్ వారు ఆడండి. గ్రూప్ గా వద్దని చెప్పిన వాళ్ళు ఏం మారట్లేదు. ప్రియాంక కోసం శోభాశెట్టి మళ్ళీ ఫౌల్ గేమ్ ఆడుతుంది. మొదట హౌస్ లో బాటమ్-5 కి మధ్య పోటీ పెట్టగా అంబటి అర్జున్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు. ఇక ఈ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని కంటెస్టెంట్స్ తో డిఫెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాప్-5 లోని ఎవరితో ఆడతావని అర్జున్ ని అడుగగా యావర్ తో అని చెప్పాడు. వీరిద్దరి మధ్య ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అదేంటంటే.. బాల్స్ ని స్టాండ్ మీద పెట్టి వాటిని పడకుండా బ్యాలెన్స్ చేయాలనే టాస్క్ ని ఇచ్చాడు. దీనిలో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని గెలుచుకున్నాడు.
యావర్ ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని కాపాడుకోవడానికి టాప్-5 లోని మిగిలిన నలుగురితో పోటీ పడమని చెప్పాడు బిగ్ బాస్. స్కూటర్ పై సవారి విజయానికి దారి టాస్క్ లో ప్రశాంత్ పై యావర్ గెలిచాడు. ఆ తర్వాత ఐ లవ్ బర్గర్ ఛాలెంజ్ లో శోభా శెట్టి మీద యావర్ గెలిచాడు. మూడవ టాస్క్ విల్లు ని పట్టుకొని బాల్స్ ని పెట్టి చివరి వరకు ఉన్నవారే విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో ఫస్ట్ బజర్ తర్వాత ప్రియాంక అవుట్ అయింది.
ఇక సెకండ్ బజర్ తర్వాత శివాజీ అవుట్ అయ్యి యావర్ గెలిచాడు. అయితే ఈ టాస్క్ కి సంచాలకులుగా శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉన్నారు. ఇక అక్కడే అసలు గేమ్ మొదలైంది. ఆడిన ముగ్గరిలో ఫస్ట్ డ్రాప్ అవుట్ అయిన ప్రియాంక ఒక్కతే విన్నర్ అని శోభాశెట్టి వాదిస్తుంది. టాస్క్ నియామాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ చెప్పాడని అశ్వగంధ(గౌతమ్ కృష్ణ), కన్నింగ్ అర్జున్ కలిసి నొక్కి పట్టీ మరీ చెప్పడంతో శోభా శెట్టి ఆలోచనలో పడింది. అసలు నియమాల ప్రకారం ప్రియంక ఆడిందని, యావర్ శివాజీ రాంగ్ ఆడారని ప్రియంకని గెలిపించాలని శివాజీతో శోభాశెట్టి వాగ్వాదానికి దిగింది. శివాజీ బాల్స్ ని ఎక్కువ సేపు పట్టుకున్నాడని అది లెక్కలోకి తీసుకోనని యావర్ హోల్డ్ చేశాడని చెప్పి ప్రియాంకకి సపోర్ట్ గా మట్లాడుతుంది శోభాశెట్టి. మరి సంఛాలక్ గా ఉండి తన స్నేహితురాలిని గెలిపించుకోవాలని చూస్తున్న శోభాశెట్టి ప్రయత్నం ఫలిస్తుందా? ఈ ఇష్యూలో బిగ్ బాస్ ఇన్వాల్వ్ అవుతాడా చూడాలి మరి.