English | Telugu
వీడియోలో మిమ్మల్నే చూసాను..
Updated : Nov 17, 2023
ఈ వీడియోలో నేను మిమ్మల్నే చూసాను శీను గారు అంటూ ఆరియానా గెటప్ శీను గురించి ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ చేసింది. రకరకాల గెటప్స్ తో అలరిస్తూ ఎంటర్టైన్ చేసే జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను ఇప్పుడు "రాజు యాదవ్" మూవీలో నటించాడు. ఈ మూవీ టైటిల్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "చౌరస్తా ఫేమ్ రామ్ మిరియాల" ఈ సాంగ్ ని పాడాడు. ఇక దీని మీద జబర్దస్త్ మిగతా కమెడియన్స్ అంతా గెటప్ శీను మూవీ పోస్టర్ ని వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడిస్ లో పోస్ట్ చేసుకున్నారు.
ఆరియానా కూడా అలాగే పోస్ట్ చేసుకుంది. "హలో గెటప్ శీను గారు..ఫస్ట్ సింగల్ రిలీజ్ అయ్యింది కదా హా అది చాలా బాగుంది..మీరు కూడా బాగున్నారు చూడడానికి.. ఆ సాంగ్ ట్రాక్ ని ఇప్పుడే చూసాను.. సాంగ్ సూపర్బ్ గా ఉంది, చాలా ఫీల్ ఉంది నేను మాత్రం మీ వీడియోలో మిమ్మల్నే చూసాను శీను గారు..ఆల్ ది వెరీ బెస్ట్..కంగ్రాట్యులేషన్స్" అంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ ఐన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక జబర్దస్త్ నుంచో ఒక్కొక్కరిగా యాక్టర్స్, డైరెక్టర్స్ ఐపోతున్నారు. ఆల్రెడీ సుధీర్ హీరోగా మూవీస్ చేస్తున్నాడు ఇక సైడ్ క్యారెక్టర్స్ వేస్తున్న శీను ఇప్పుడు మూవీస్ వైపు ద్రుష్టి పెట్టాడు. ఇక వేణు డైరెక్టర్ అయ్యాడు..ఇలా ఎంతో మంది స్మాల్ స్క్రీన్ మీద సక్సెస్ ఐన వాళ్లంతా బిగ్ స్క్రీన్ మీద తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ రాజు యాదవ్ మూవీ ద్వారా కృష్ణమాచార్య డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ మూవీలో జబర్దస్త్ కమెడియన్స్ చాలామంది కూడా వేరేవేరే రోల్స్ లో కనిపించబోతున్నారు.