English | Telugu

Krishna Mukunda Murari: ఆ ప్లాన్ తో కృష్ణపై ముకుంద పగ తీర్చుకోనుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -316 లో.. మురారి కృష్ణకి గిఫ్ట్ గా రింగ్ ఇవ్వడం చూసి ఓర్వలేని ముకుంద ఎలాగైనా అందరి ముందు నిజం బయటపెట్టాలని అనుకుంటుంది. కృష్ణ పెట్టుకున్న రింగ్ నాదే అని ముకుంద చెప్పగానే.. భవాని నమ్మి తన రింగ్ తనకి ఇవ్వమని చెప్తుంది. కృష్ణ మురారి నిజం చెప్తే భవాని తిడుతుందని సైలెంట్ గా ఉంటారు. కృష్ణకి రింగ్ రాకపోయేసరికి మురారి తియ్యబోతుంటే.. భవాని వద్దు అని చులకనగా మాట్లాడేసరికి కృష్ణ బాధపడుతు అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత మురారి కూడా బాధపడుతు.. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయాక భవానికి ముకుంద నిజం చెప్తుంది. రింగ్ నాది కాదు.. కృష్ణకి మురారి గిఫ్ట్ ఇచ్చాడు. అది బయట పెడితే వాళ్ళకి మీరు చివాట్లు పెడతారని, ఇద్దరు సెట్ అవుతారని అనుకున్నాను కానీ కృష్ణ నిజం చెప్పకుండా ఆగిపోయిందని ముకుంద అంటుంది. నువ్వు అలా చెయ్యడం వల్ల మురారి దృష్టిలో నెగటివ్ అయ్యావ్. ఇంకొక సారి అలా చెయ్యకని ముకుందతో భవాని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకవైపు కృష్ణ, శకుంతల ఇద్దరు మాట్లాడుకుంటారు. మీ పెద్ద అత్తయ్య.. అల్లుడుకి ముకుందకి పెళ్ళి చేయాలని అనుకుంటుందని శకుంతల అనగానే.. నా ప్రాణం ఉండగా అది జరగదని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి నందు వస్తుంది. అసలేం జరిగిందని తెలుసుకుంటుంది. మేం ఏం తప్పు చెయ్యలేదని నిరూపించుకోవడానికి టైమ్ కావాలి అని కృష్ణ అంటుంది. ఏసీపీ సర్ ని ముకుంద నుండి కాపాడుకోవాలని కృష్ణ అంటుంది.

మరొక వైపు అనవసరంగా మురారి దృష్టిలో నెగెటివ్ అయ్యాను. ఈ చీర కృష్ణకి ఇవ్వమని చెప్పి కూల్ చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి మురారి వచ్చి.. ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. నాకు కృష్ణ వాళ్ళు చేసిన తప్పు గుర్తుకు వచ్చింది. అందుకే చేశా నువ్వు బాధపడ్డావ్. అన్ని షాప్ లు తిరిగి ఈ చీర తీసుకొని వచ్చాను కృష్ణకి ఇవ్వు అని మురారిని పంపిస్తుంది ముకుంద. మరొకవైపు మురారిని అమెరికా పంపించడం ఎందుకని నందు అడుగుతుంది. అప్పుడే అమెరికా నుండి తన ఫ్రెండ్ కాల్ చేస్తే.. మూడు రోజుల్లో పంపిస్తున్నానని భవాని చెప్తుంది. అది విని రేవతి నందు ఇద్దరు షాక్ అవుతారు. మరోవైపు చీర తీసుకొని కృష్ణ దగ్గరకు వస్తాడు మరారి. కృష్ణ బాధపడుతుంటే ఆ చీర ఇచ్చి.. నా వల్లే ఇదంతా అని సారీ చెప్తాడు. తరువాయి భాగంలో.. భవాని కుటుంబం హ్యాపీగా దీపావళి జరుపుకుంటుంది. ఈ పండగలో కృష్ణపై ముకుంద ఏం ప్లాన్ చేయనుందో? ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.