English | Telugu

రతికకు గట్టిగా ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. షాకైన గౌతమ్!

వాడిని అనవసరంగా వదిలేసారురా.. మడతబెట్టాల్సింది. ఇది గౌతమ్ కృష్ణతో అంబటి అర్జున్ అన్న మాట. హౌస్ లోకి వచ్చేకంటే ముందే అందరి ఆట చూసి గట్టిగ ప్లాన్ చేసుకొని వచ్చాడు అంబటి అర్జున్. అందుకే హౌస్ లోకి వచ్చిన నుండి కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. మొదటి వారం అమర్ దీప్ ని నామినేట్ చేసి సీరియల్ బ్యాచ్ కి వ్యతిరేకం అన్నట్టు కలరింగ్ ఇచ్చి.. ఇక హౌస్ లో కొన్ని వారాలే మిగిలిందని శివాజీ, ప్రశాంత్, యావర్ లని టార్గెట్ చేశాడు అంబటి అర్జున్. ఇక ప్రతీవారం వీళ్ళ ముగ్గిరినే టార్గెట్ చేస్తూ గౌతమ్ కృష్ణకి లేనిపోనివి కల్పించి చెప్పి అతని మైండ్ ని పొల్యూట్ చేశాడు అర్జున్. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణకి ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో? ఎవరు సేఫ్ గేమ్ అవుతున్నారో అర్థం కాక అంబటి అర్జున్ ని అన్న అన్న అంటు అతనేం చెప్పిన గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. దీంతో హౌస్ లో వీళ్ళిద్దరి ప్రవర్తన వల్ల వీరిద్దరికి నెగెటివిటి బాగా పెరిగింది.

బ్రహ్మముడి కావ్యకి అరుదైన అవార్డు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. 

డబుల్ ఎలిమినేషన్ కాదు ట్రిపుల్ ఎలిమినేషన్.. బయటకు వచ్చేదెవరు?

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం నడుస్తుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ గత సీజన్ లలో జరిగిన దాని ప్రకారం పదిహేనవ వారం ఎలిమినేషన్ ఉండదు. మధ్యలో మిగిలింది రెండే వారాలు. కానీ హౌస్‌లో ఉన్నది పది మంది. వచ్చే వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలేది ఎనిమిది మంది‌. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దాంతో ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ డేంజర్ జోన్ లోని ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తాడేమోనని అనిపిస్తుంది.