English | Telugu

Brahmamudi : రాత్రిపూట బాయ్ ఫ్రెండ్ ని కలిసిన స్వప్న!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -255 లో... ఎందుకు బోర్డుపై సారి అని రాసి నేను రాసానట్టుగా కావ్య ఎందుకు చెప్పిందని రాజ్ కోపంగా ఉంటాడు. కావ్య రాగానే ఎందుకు అలా చేసావని అడుగుతాడు. కాసేపు రాజ్ తో కావ్య వెటకారంగా మాట్లాడిన కూడా.. ఆ తర్వాత తాతయ్య గారి కోసం మీలాగే నేను ప్రేమిస్తున్నట్లు నటించానని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. రాజ్ కి మాత్రం కావ్య ఏం చెప్పిందో అర్థం కాదు.

ఒకవైపు అరుణ్ , స్వప్న కలిసి ఉన్న ఫొటోస్ కొరియర్ చేస్తానని చెప్పాడు. ఇంకా కొరియర్ రాలేదని అరుణ్ కి ఫోన్ చేస్తాడు రాహుల్. ఆలోగా కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ ధాన్యలక్ష్మి తీసుకొని ఇందిరాదేవీకి ఇస్తుంది. అవి ఓపెన్ చేసిన ఇందిరాదేవి.. స్వప్న తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫొటోస్ చూసి షాక్ అవుతుంది. ఇలా ఎవరు పంపించారని ఇందిరాదేవి వెళ్లి స్వప్నని అడుగుతుంది. స్వప్న ఆ ఫొటోస్ చూడగానే కంగారు పడుతుంది. కానీ అతను ఎవరో తెలియదని స్వప్న అంటుంది. స్వప్న చెప్పేది అబద్ధమా? లేక ఈ ఫొటోస్ అబద్ధమా అని ఇందిరాదేవి అనుకుంటుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పదు. అదంతా చూస్తున్న రాహుల్, రుద్రాణి.. ఏంటి ఇంట్లో పెద్ద గొడవ అవుతుందనుకుంటే ఆవిడేంటి అసలు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని అనుకుంటారు. మరొకవైపు స్వప్న అసలు ఈ ఫొటోస్ ఎవరు పంపించారని అరుణ్ కి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చెయ్యడు.

ఒకవైపు కనకం అప్పు గది సర్దుతుంటుంది. అప్పుడు తనకి కళ్యాణ్ ఫోటోపై ఐ లవ్ యూ అని రాసి ఉంది చూసి షాక్ అవుతుంది. వెంటనే అప్పు దగ్గరికి వెళ్లి ఎంత పని చేసావే అంటూ కోప్పడుతుంది. ఇప్పటికి ఆ ఇంట్లో ఇద్దరు కూతుళ్లు ఇబ్బంది పడుతున్నారని అప్పుని కొట్టబోతుంటే కృష్ణమూర్తి వచ్చి.. ఆగమని చెప్తాడు. కృష్ణమూర్తికి ఇదంతా చెప్తే బాధపడుతాడు అని కనకం చెప్పకుండా కవర్ చేస్తుంది. కృష్ణమూర్తి.. ఏమైంది అని అడిగిన కూడ డైవర్ట్ చేస్తుంది కనకం. తరువాయి భాగంలో అరుణ్ దుగ్గిరాల ఇంటి ముందుకు వచ్చి స్వప్నకి కాల్ చేస్తాడు. నీతో తిరిగినంత మాత్రాన ఆ ఫొటోస్ ఎందుకు పంపించావని అరుణ్ ని నిలదీస్తుంది స్చప్న. నేను మీ ఇంటిముందు ఉన్నాను. నువ్వు బయటకు రా అని అనగానే స్వప్న ఇంట్లో ఎవరు చూడకుం

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.