English | Telugu

Guppedantha Manasu : భర్తలో వచ్చిన మార్పుని భార్య కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -923 లో.. అనుపమ బ్యాగ్ తో రావడం చూసిన విశ్వనాథ్.. మమ్మల్ని వదిలేసి మళ్ళీ దూరంగా వెళ్తున్నావా అని అని అడుగుతాడు. ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండి మిమ్మల్ని బాధపెట్టాను. నేను బాధపడ్డాను కానీ ఇప్పుడు ఇలా చెయ్యను. నాకు ఒక పని ఉంది. అది పూర్తి చేసుకొని వస్తానని విశ్వనాథ్ కి అనుపమ చెప్తుంది. ఎక్కడకి వెళ్తున్నావని విశ్వనాథ్ అడుగుతాడు. ఎక్కడకి అని తెలియదు. నాకేం చెయ్యాలని మాత్రమే తెలుసని అనుపమ చెప్తుంది.

నీ కోడలు కూడా నీలాగా తయారైందని విశ్వనాథ్ అంటాడు. నీకు ఒకటి చెప్తున్నాను విను. నా జీవితం లాగా నీ జీవితం కాకూడదని ఏంజెల్ కి అనుపమ చెప్తుంది. మరొకవైపు ధరణి దగ్గరికి శైలేంద్ర కాఫీ తీసుకొని వచ్చి ఇక నుండి నిన్ను ఇబ్బందిపెట్టను. నేను మారిపోయాను నిన్న డాడ్ చెప్పినప్పటి నుండి బాగా అలోచించను. నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ విషయంలో చాలా తప్పు చేసానని శైలేంద్ర అంటాడు. మీరు నిజంగానే మారిపోయరా అని ధరణి ఆశ్చర్యంగా అంటుంది. నేను మారిపోయాను ఇక నుండి నిన్ను హ్యాపీగా చూసుకుంటానని శైలేంద్ర అనడం ఫణీంద్ర వింటాడు. శైలేంద్ర లో వచ్చిన మార్పు చూసిన ఫణీంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు దేవయాని విని నిజంగానే శైలేంద్ర మారిపోయాడా జీవించేస్తున్నాడా అని అనుకుంటుంది. ఆ తర్వాత దేవయాని దగ్గరికి ఫణీంద్ర వచ్చి.. ఏంటి అలా ఉన్నావని అడుగుతాడు. మీరు నిన్న నా గురించి ఎంత చెడుగా మాట్లాడారు. నేను గయ్యాళినే కానీ దుర్మార్గురాలిని కాదు కోపంగా మహేంద్రని అలా అన్నాను. తర్వాత సారీ చెప్పి ఇంటికి రమ్మని చెప్పానని దేవయాని నటిస్తుంది. నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని దేవయానితో ఫణింద్ర అంటాడు.

మరొకవైపు అనుపమ అన్న మాటలు గుర్తుకు చేసుకొని మహేంద్ర బాధపడుతుంటాడు. ఆ ప్రెషర్ తట్టుకోలేక డ్రింక్ చెయ్యబోతుంటే అప్పుడే రిషి వసుధారలు వచ్చి ఆపుతారు. మీరు పోయిన అమ్మ గురించి అలోచించి నన్ను బాధపెడుతున్నారు. ఇంకా ఎప్పుడు తాగకండి అని రిషి నాపై ఒట్టు వెయ్యమని చెయ్యి తన తలపైన పెట్టుకుంటాడు. అప్పుడు మహేంద్ర ఎప్పుడు తాగనని రిషి పైన ఒట్టు వేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర ని రిషి హగ్ చేసుకుంటాడు. మీరు ఎప్పటిలాగా ఉండాలి. కాలేజీకీ రావాలని వసుధార మహేంద్రతో అంటుంది. మీరు కాలేజీకీ వస్తున్నారని రిషి అనగానే.. మహేంద్ర సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.