English | Telugu
ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం... యాంకర్ గా మంచు మనోజ్
Updated : Nov 17, 2023
"మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" అంటూ రీసెంట్ గా టెలికాస్ట్ ఐన ఎపిసోడ్ మంచు మనోజ్ సంబంధించిన ఒక సీక్రెట్ ని సుమ, శ్రీముఖి బయట పెట్టారు. ఇక ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ గా మనోజ్ వచ్చేసరికి లేడీస్ అంతా కలిసి కాసేపు ఆడిపాడారు. మనోజ్ మూవీస్ లోని హిట్ సాంగ్స్ కి పండు మాస్టర్, శ్రీ సత్య, మానస్ డాన్స్ వేసి ఎంటర్టైన్ చేశారు. తర్వాత సుమ వచ్చి ఆ సీక్రెట్ ని రివీల్ చేసింది " వెల్కమ్ తో యాంకర్ ఫామిలీ" అని మనోజ్ కి షాక్ హ్యాండ్ ఇచ్చింది.
"త్వరలో ఈటీవీ విన్ లో కొత్త షో రాబోతోంది..ఆ షో హోస్ట్ చేయబోతున్న నీకు ముందుగా హార్టీ కంగ్రాట్యులేషన్స్ " అంటూ సుమ విష్ చేసింది. "యాక్చ్యువల్లి ఇండస్ట్రీలో ఇంతమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నారు..కానీ మేల్ యాంకర్స్ చాలా తక్కువ..అందులోనూ మీరు ఇంత హ్యాండ్సం యాంకర్ గా వస్తే మా అమ్మాయిలకు పండగే పండగ" అని శ్రీముఖి గట్టిగానే క్రీం బిస్కెట్స్ వేసేసరికి మనోజ్ గా అబ్బబ్బ అన్నాడు...
ఇక మనోజ్ "ఇంతమంది లేడీస్ ని ఇక్కడ ఒకేసారి చూసేసరికి బోయపాటి గారిని రిక్వెస్ట్ చేసి ఒక సినిమా కొట్టేయండి మాతో పాటు" అని అడగలనిపిస్తోంది అన్నాడు ఫన్నీగా.. మనోజ్ డైలాగ్ కి శ్రీముఖి మళ్ళీ వేసేసింది ఒక పంచ్ " సుమక్కా యాంకర్ కి ఉండాల్సిన టైమింగ్, స్పాంటేనిటీ, కామిక్ సెన్స్, హ్యూమర్ అన్నీ ఉన్నాయి" అనేసరికి " హే వేసేసింది..అమ్మా ముఖి " అంటూ నవ్వేసాడు మనోజ్...ఇక షో గురించి చెప్పాలంటూ శ్రీముఖి గారంగా అడిగేసరికి "ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం" అనే షోకి హోస్ట్ గా చేయబోతున్నట్టు చెప్పాడు మంచు మనోజ్...సెలబ్రిటీస్ తో టాక్ గేమ్ షో అంటే మాట్లాడుకుంటూ ఆడడం ఈ షో స్పెషల్. మరి యాంకరింగ్ పూర్తిగా నేర్చుకున్నారా అని శ్రీముఖి అడిగేసరికి "ఇంకా లేదు మదర్ ఆఫ్ ది యాంకర్స్ ఆఫ్ ది యూనివర్స్ సుమ గారి నుంచి మిగతా యాంకర్స్ ని పాయింట్స్ అన్ని తీసుకెళదాం అని ఇక్కడికి వచ్చా" అని చెప్పాడు మనోజ్.