English | Telugu

Pallavi Prashanth: అప్పుడు రేవంత్ ఇప్పుడు ప్రశాంత్.. తగ్గేదేలే!


ఎవ్వరైనా కానీయ్.. ఏదైనా కానియ్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ రేవంత్ అన్నాడు. బిగ్ బాస్ సీజన్-6 టైటిల్ విన్నర్ రేవంత్ హౌస్ లో అగ్రెసివ్ అండ్ జెన్యున్ అండ్ ఫెయిర్ ప్లేయర్. ‌ఇప్పుడు అదే కోవలోకి పల్లవి ప్రశాంత్ చేరాడు.

బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి పది వారాల వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ.. నామినేషన్ లో తగ్గేదేలే అంటున్న రైతుబిడ్డ ‌పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. మన సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూడటం‌‌.. అరేయ్, ఒరేయ్.. వాడు దొంగలాగే ఉంటాడంటూ బ్యాక్ బిచ్చింగ్ చేశారు.

కావాలనే చాలాసార్లు ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేస్తున్నారు సీరియల్ బ్యాచ్‌. అయితే ఎవరెన్ని సార్లు నామినేట్ చేసిన తన కాన్ఫిడెన్స్ ని కోల్పోవట్లేదు పల్లవి ప్రశాంత్. ఒక నామినేషన్ లో అయితే ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. అయిన బరాబర్ ఇలానే ఉంటాను, తగ్గేదేలా అంటూ సవాల్ విసిరి తన ఆటతో సమాధానం చెప్పాడు ప్రశాంత్. " వీడెంత అనుకునేవాళ్ళతో, అమ్మో వీడుంటే మనం గెలవలేం" అనే స్థాయికి చేరుకున్నాడు ప్రశాంత్.

అయితే గత సీజన్-6 లో కూడా రేవంత్ ఇదే మాదిరి హౌస్ లో ఉన్నాడు‌. ఆటలో అగ్రెసివ్, నామినేషన్ లో మాస్ ఎటాక్ తో తనని తాను మల్చుకొని టైటిల్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సైతం అదే పంథాలో వెళ్తున్నాడు. టాప్-3 లో పల్లవి ప్రశాంత్ ఉంటాడని బిగ్ బాస్ ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సీజన్-7 టైటిల్ రేసులో రైతుబిడ్డ గెలుస్తాడా? లేదా తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.