English | Telugu

Gautham Krishna Eliminated: గౌతమ్ కృష్ణ ఎలిమినేటెడ్.. ఏడుస్తున్న రతిక, అశ్వినిశ్రీ!

బిగ్ బాస్ సీజన్-7 మొదలై ఇప్పటికే పదకొండు వారాలు పూర్తిచేసుకొని పన్నెండవ వారం నడుస్తుంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్ బాస్ గత సీజన్ లలో జరిగిన దాని ప్రకారం పదిహేనవ వారం ఎలిమినేషన్ ఉండదు. మధ్యలో మిగిలింది రెండే వారాలు. కానీ హౌస్‌లో ఉన్నది పది మంది. వచ్చే వారం ఇద్దరిని డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలేది ఎనిమిది మంది‌. పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది. దాంతో ఒకర్ని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయొచ్చు కానీ ఈ సీజన్ లో ఉల్టా పల్టా థీమ్ తో బిగ్ బాస్ డేంజర్ జోన్ లోని ఒకరిని డైరెక్ట్ గా ఎలిమినేట్ చేస్తాడేమోనని అనిపిస్తుంది.