English | Telugu

Brahamamudi : నటనలో ఆ ఇద్దరు అదుర్స్.. ఎమోషనల్ గా చిన్న కూతురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మమూడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -256 లో... కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం తెలుసుకొని తనపై చెయ్యి చేసుకుంటుంది కనకం. ఆ తర్వాత కృష్ణమూర్తి రాగానే సైలెంట్ గా ఉండి, ఏం చెప్పదు కనకం. ఏమైందని అడిగిన కూడా తనలో తను బాధపడుతుంది కానీ అప్పు విషయం కృష్ణమూర్తికి కనకం చెప్పదు.

మరొక వైపు అందరు టిఫిన్ చేస్తుంటే.. స్వప్న టిఫిన్ చెయ్యడానికి వచ్చి ఇందిరాదేవి ని చూసి ఎక్కడ అరుణ్ గురించి అడుగుతుందేమోనని బయపడి వెనక్కి పోతుంటే రుద్రాణి కావాలనే.. స్వప్నని టిఫిన్ చెయ్యడానికి పిలుస్తుంది. స్వప్న వచ్చి ఇందిరాదేవి చూసే చూపుని తట్టుకోలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాజ్ వచ్చి టిఫిన్ చెయ్యడానికి కూర్చొని ఉంటాడు. నిన్న నన్ను ఇరికిస్తావా ఇప్పుడు నా నటన చూడు అని మనసులో అనుకుంటాడు. కళావతి ఇడ్లీ పెట్టు, చట్నీ వెయ్యి అంటూ అటు ఇటు తిరిగేలా చేస్తాడు రాజ్. ఇక వాళ్ళని చుసిన ఇంట్లో వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటారు. ఆ తర్వాత రాజ్ టిఫిన్ పూర్తి అయి హ్యాండ్ వాష్ కి వెళ్తాడు. ఇప్పుడు నా యాక్టింగ్ చూడండని కావ్య మనసులో అనుకుంటుంది.

న్యాప్కీన్ కీ బదులు తన చీర కొంగుని పెడుతుంది కావ్య. అది చూడకుండా రాజ్ తన చెయ్యిని తుడుచుకోవడంతో.. కావ్య కావాలనే ఏంటి అండి అందరిముందు న్యాప్కిన్ ఇస్తున్నాను కాదా అని.. అనగానే ఇంట్లో అందరూ చూసి నవ్వుకుంటారు. అపర్ణ కోపంగా చూడడంతో ఇది మాములుగా ఇరికించలేదుగా అనుకుంటాడు రాజ్. మరొక వైపు అరుణ్ కి స్వప్న ఫోన్ చేస్తుంది. రాహుల్ కి ఫోన్ చేసి స్వప్న ఫోన్ చేస్తున్న విషయం అరుణ్ చెప్తాడు.. నువ్వు లిఫ్ట్ చెయ్యకని రాహుల్ చెప్తాడు. ఆ తర్వాత ఇందిరదేవి రావడం చూసి రాహుల్ నీ పర్ ఫామెన్స్ చూపించమని రుద్రాణి చెప్పి వెళ్ళిపోతుంది. రాహుల్ ఎదో బాధపడినట్లుగా.. అరుణ్ స్వప్న కలిసి ఉన్న ఫోట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కావాలనే రాహుల్ ఆ ఫోటో కిందకి పడేసి వెళ్తాడు. అప్పుడు ఇందిరాదేవి వచ్చి.. ఆ ఫోటో చూసి రాహుల్ కి కూడా ఈ విషయం తెలిసి బాధపడుతున్నట్లున్నాడు. ఇంట్లో ఎవరికీ తెలియకముందే ఈ విషయం రాజ్ కి చెప్పాలని ఇందిరాదేవి అనుకుంటుంది.

మరొక వైపు అప్పు బాధపడుతుంటే కనకం వచ్చి.. తనపై చెయ్యి చేసుకున్నందుకు బాధపడుతుంది. ఆ తర్వాత నాకు తెలియకుండానే అతనిని ప్రేమించానని అప్పు చెప్తూ ఎమోషనల్ అవుతుంది.ఆ మరొక వైపు రాజ్ రావడం చూసిన కావ్య.. కావాలనే ఏదో బుక్ చూస్తూ స్టోరీని రాజ్ కీ వినిపించేలా చదువుతుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.