English | Telugu
Guppedantha Manasu: శైలేంద్రకి ఫణీంద్ర వార్నింగ్.. అనుపమ నిజం కనిపెట్టనుందా?
Updated : Nov 16, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -922 లో.. వసుధార లేవకముందే రిషి లేచి వంట చేస్తుంటాడు. మీకు ఇక్కడ ఎక్కడ ఏం ఉన్నాయో తెలుసా అని వసుధార అనగానే.. అన్ని తెలుసంటూ చూపిస్తాడు రిషి. ఆ తర్వాత పైన రైస్ చూసుకోకుండా తీస్తుంటే అవి ఇద్దరిపైన పడుతాయి. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.
అల్యూమిని ప్రోగ్రామ్ లో ఆ అనుపమ, మహేంద్ర కలుసుకున్నారంట. ఇప్పుడు ఆ అనుపమకి జగతి విషయం కనుక తెలిస్తే అసలు ఊరుకోదు. అదంతా మనమే చేసామని తెలిస్తే అసలు వదిలి పెట్టదని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. ఈ క్షణం నుండీ వాళ్ళేం చేసిన నాకు తెలుస్తుంది. తెలియాలని శైలేంద్ర అనగానే.. ఫణింద్ర వచ్చి శైలేంద్ర చెంప చెల్లుమనిపిస్తడు. ఏంటి నీకు ఏం చేసిన తెలియాలా? ఎందుకు తెలియాలంటూ శైలేంద్ర పైకి విరుచుకుపడతాడు ఫణీంద్ర.
అసలు ఇందంతా చూస్తుంటే జగతి చనిపోవడానికి కారణం నువ్వే అయి ఉంటావ్. మహేంద్ర ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి కారణం మీ అమ్మ అని ఫణింద్ర అంటాడు. అలా అంటున్నారు ఏంటని శైలేంద్ర అమాయకంగా అడుగుతాడు. నువ్వు ఇక్కడ వద్దు ఫారెన్ వెళ్ళిపో, మిమ్మల్ని మాట్లాడుకోవద్దని చెప్పాను కదా అని ధరణిని పిలిచి వీళ్ళు మాట్లాడుకోకుండా చూడమని చెప్పాను కదా అని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి మన మీద పడ్డారేంటని దేవయాని అనగానే.. నువ్వేం టెన్షన్ పడకు అన్నింటికి సొల్యూషన్ నా దగ్గర ఉందని శైలేంద్ర అంటాడు.
మరొక వైపు అనుపమ అన్న మాటలు మహేంద్ర గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే అనుపమ కాల్ చేసి.. జగతి గురించి ఎందుకు చెప్పలేదు అంటు విసిగిస్తుంది. దాంతో అనుపమతో కోపంగా మాట్లాడి మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మహేంద్ర కోపంగా మాట్లాడడం రిషి, వసుధార ఇద్దరు వింటారు. ఒకవైపు అనుపమ ఎలాగైనా జగతి గురించి తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ తో హాల్లోకి వస్తుంది అనుపమ. అలా రావడం చూసిన విశ్వనాథ్, ఏంజిల్ ఇద్దరు చూసి మళ్ళీ వాళ్ళని వదిలేసి వెళ్లిపోతుందని అనుకుంటారు. మిమ్మల్ని గతంలో లాగా కష్టపెట్టనని విశ్వనాథ్ తో అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.