గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్ బాస్ సీజన్-7 లో ఒక అన్ వాంటెడ్ , అన్ యూజ్ ఫుల్, అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ చివరి దాకా ఉన్నాడంటే అది గౌతమ్ కృష్ణ అని చెప్పొచ్చు.అశ్వగంధ అలియాజ్ గౌతమ్... హౌస్ లో మోస్ట్ అన్ డిజర్వింగ్ అని ఎవరైన ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఈ గౌతమ్. హౌస్ లో పన్నెండు మంది హౌస్ మేట్స్ ఉన్నా, ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నా గౌతమ్ కి నామినేషన్ లో గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు శివాజీ. ప్రతీ వారం కారణం లేకుండా సిల్లీ రీజన్స్ తో శివాజీని నామినేట్ చేయడం, కంటెంట్ కోసం వాగ్వాదానికి దిగడం తప్ప ఒక్క గేమ్ లో కూడా గెలిచింది లేదు. ఆట ఆడింది లేదు, యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు. ఇంకా ఎంచుకున్నాడంటే ఎలిమినేషన్ అవ్వడానికి ఇతర కంటెస్టెంట్స్ ఉండటమే కారణం లేదంటే నాలుగో వారంలోనే బయటకు వచ్చే కంటెస్టెంట్ గౌతమ్.