English | Telugu

సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-7 లో రెండు బ్యాచ్ లుగా ఇప్పుడు నడుస్తుంది. ఒకటి అమర్ దీప్, ప్రియంక, శోభాశెట్టి లు కలిసి గ్రూప్ గా ఆడుతున్న సీరియల్ బ్యాచ్. మరొకటి స్పా బ్యాచ్.. ఏ కుళ్ళు, కుతంత్రాలు లేకుండా గెలుపు కోసమే ప్రయత్నిస్తూ ఒక్కొక్కరిది ఒక్కో గేమ్ ప్లాన్ తో, ఎవరి ఆట వారు ఆడుతూ అందరి అభిమానం సంపాదించుకున్న స్పై బ్యాచ్. ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లలో గౌతమ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే‌. అంబటి అర్జున్ ఫినాలే అస్త్రని గెలిచి ఫైనల్ వీక్ కి చేరుకున్నాడు.‌

ఇక పద్నాల్గవ వారం హౌస్ లో ఎవరు ఎలిమేట్ అయి బయటకు వస్తారనే ప్రశ్న అందరిలోను నెలకొంది. హౌస్ లో నెగెటివిటి ఉన్న కంటెస్టెంట్స్ శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియంక అయితే వీరిలో ఎక్కువ నెగెటివిటి ఎవరికు ఉందంటే శోభాశెట్టికే అని వందకి తొంభై శాతం మంది అంటారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లో శోభాశెట్టి మొదటి నుండి ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేస్తు ఉండటం ఒక కారణమైతే.. పల్లవి ప్రశాంత్ ని తక్కువగా చూస్తూ, యావర్ ని ప్రతీసారీ నామినేషన్ లో ట్రిగ్గర్ చేయడం.. ఇక ఎవరి దగ్గర ఏ పాయింట్లు లేకపోతే శివాజీని నామినేట్ చేసి మీరు ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం మరొకటి. ఇక అసలు సూత్రధారి ప్రియాంక .. ఎంత కన్నింగ్ అంటే నాగార్జున ముందు‌ సింపుల్ గా స్మైల్ ఇస్తూ అదేం లేదు సర్ అంటు నిజాలని కప్పేస్తుంటుంది.‌ నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో అన్ డిజర్వింగ్ ఎవరని అడిగాడు నాగార్జున. యావర్, శోభాశెట్టికి అన్ డిజర్వింగ్ అనే ట్యాగ్ ఇచ్చాడు గౌతమ్. గౌతమ్, ప్రియాంకలకి అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చాడు ప్రశాంత్. అమర్ దీప్, గౌతమ్ లకి శివాజీ అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చాడు.‌ ఇలా ఒక్కొక్కరు కారణాలు చెప్తూ అన్ డిజర్వింగ్ ఇచ్చారు.

యావర్, ప్రశాంత్ లకి అన్ డిజర్వింగ్ ట్యాగ్ ఇచ్చింది ప్రియాంక. కారణమేంటని నాగార్జున అడిగితే.. యావర్‌ గేమ్ తగ్గింది. ఇంకా హౌస్ లో పనులు చేయట్లేదు‌ ‌ ప్రశాంత్‌ హౌస్ లో ఎక్కువ పనులు చేయట్లేదు. ఏదైన టాస్క్ ఓడిపోతే తీసుకోలేకపోతున్నాడని ప్రియంక కారణాలు చెప్పగానే.. అవునా మరి అమర్‌దీప్ ప్రతీ టాస్క్ లో ఓడిపోతానని ఏడుస్తున్నాడని, పాయింట్ల కోసం అంత చేశాడు‌ కదా మరి అతడికి ఎందుకు అన్ డిజర్వింగ్ ఇవ్వలేదని నాగార్జున అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ప్రియాంకకి మైండ్ బ్లాక్ అయింది. అలాంటిదేం లేదంటూ ఇది నా అభిప్రాయం అంటూ కవర్ చేసింది ప్రియంక. అయితే ఈ వారం నామినేషన్ లో సీరియల్ బ్యాచ్ నుండి ఒకరు కచ్చితంగా బయటకు వస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందులోను శోభాశెట్టి చేసిన ఓవారాక్షన్ వల్ల తనకి మరింత నెగెటివిటి పెరిగిందనేది వాస్తవం.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.