దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు.. నాకు హెయిర్ తప్ప ఏమీ ఇవ్వలేదు!
కొందరంతే ఏం చెప్పిన ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే సీజన్-7 ఎంత ఫేమసో, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలకి యాంకర్ గా గీతు రాయల్ చేస్తుంది. సీజన్-6 లో సూటిగా సుత్తిలేకుండా మాట్లాడేది తనే. ఎవరినైనా, ఏదైనా అడిగే గట్స్, దమ్మున్న ఏకైక కంటెస్టెంట్ గీతు రాయల్.