English | Telugu
సాయిధరమ్ తేజ్ నన్ను గుర్తుపట్టారు..వర్ష డ్రీం హీరో ఆలీ
Updated : Dec 3, 2023
"ఆలీతో ఆల్ ఇన్ వన్" షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేసింది. కానీ జబర్దస్త్ టీమ్ ఎంట్రీతో ఇంకా హుషారొచ్చింది ఆడియన్స్ కి. ఆలీ మీద వర్ష తెగ సెటైర్స్ వేసింది. "నాకు మీరు అలీ గారిలా కన్పించలేదు..నా డ్రీం హీరోలా కనిపించారు" అనేసరికి ఆలీ నవ్వేశారు. ఇక తర్వాత ఇమ్ముని స్టేజి మీదకు పిలిచారు. "ఆర్టిస్ట్ గా కాకుండా ఇంకేమన్నా చేయాలా అని ఎప్పుడైనా అనిపించిందా ? అని ఆలీ ఇమ్మానుయేల్ ని అడిగేసరికి "లేదు సర్ అనిపించలేదు.
ఎందుకంటే ఇండస్ట్రీకి రాక ముందు ఒక స్కూల్ లో నేను సిస్టమ్స్ ఆపరేటర్ గా జాబ్ చేసేవాడిని. జాబ్ ఐపోగానే నేను జబర్దస్త్, సినిమాలు బాగా చూసేవాడిని. ఒకరోజు నాకు ఆడిషన్స్ ఉన్నాయని యాడ్ వస్తే చూసి అప్లై చేసాను.. అలా పటాస్ స్టాండప్ కామెడీ షోకి సెలెక్ట్ అయ్యాను. అలా జబర్దస్త్ కి కూడా వచ్చాను. ఎందుకంటే నేను గెటప్ శీను కామెడీ స్కిట్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని.. అలా జబర్దస్త్ కి వచ్చాక గెటప్ శీను అన్నకు కూడా చెప్పాను ఆయన వల్లనే ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చానని...ఆయన కూడా నా స్కిట్ చూసి బాగుంటే ఫోన్ చేసి వెంటనే చెప్తారు. అలాగే నేను సాయి ధరమ్ తేజ్ గారితో విరూపాక్షలో చేసాను. ఫస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు ఆయన షూటింగ్ లొకేషన్ కి వచ్చారు. ఆరోజు బ్రేక్ టైంలో అంత మందిలో కూడా నన్ను చూసి పిలిచి జబర్దస్త్ లో చేస్తావ్ కదా నువ్వు.. చాలా బాగా చేస్తావ్..ఐ లైక్ యువర్ స్కిట్స్ అని ఒక పావు గంట సేపు నాతో మాట్లాడ్డం..అంతమందిలో నన్ను గుర్తుపట్టారు అని అనిపించి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది" అని చెప్పాడు ఇమ్మానుయేల్. ఇక వర్ష, ఇమ్మానుయేల్, బులెట్ భాస్కర్ మల్లెమాల షోస్ లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న కమెడియన్స్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.