English | Telugu
పొలిటికల్ గా ట్రోల్స్ చేయొద్దంటు సుప్రిత ఎమోషనల్ పోస్ట్!
Updated : Dec 4, 2023
తెలంగాణలో నిన్న జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలవడంతో అతడిని కలిసిన ఫోటోని సుప్రిత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో సురేఖావాణి, రేవంత్ రెడ్డి, సుప్రిత ఉన్నారు. అయితే ఆ తర్వాతి పోస్ట్ లో బీఆర్ఎస్ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ ట్యాగ్ చేస్తూ.. మేం చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే సర్ అనే మెమీ పోస్ట్ ని షేర్ చేసింది.
టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. తల్లీకూతుర్ల మాదిరి కాకుండా స్నేహితుల్లా ఉంటారు. సురేఖ తన కూతురితో కలిసి పబ్స్ కి కూడా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని డైరెక్టుగా ఒప్పేసుకుంటుందామె. అయితే రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో ట్రెండింగ్ లో ఉండే సుప్రిత ఇప్పుడు పొలిటికల్ గా వైరల్ అవుతుంది.
ఇన్ స్టాగ్రామ్ లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని విష్ చేసిన సుప్రితకి అనుకోని విధంగా.. విమర్శలు, ట్రోల్స్ వచ్చాయంట. దానికి సుప్రిత తీవ్రంగా భాదపడుతు ఒక పోస్ట్ ని అభిమానులతో పంచుకుంది. " నేను మీకు ఏం చేశాను. ఎందుకు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. నన్ను ఎందుకు ట్యాగ్ చేస్తూ పొలిటకల్ గా దూషిస్తూ ఇలా చేస్తున్నారెందుకు. నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశాను. ఆ పోస్ట్ లో పోస్ట్ కొత్త సీఎమ్ ని విష్ చేసానంతే. ఎందుకిలా చేస్తున్నారు. మీరు చేసే ఈ హరాజ్ మెంట్ వల్ల ఒక వ్యక్తి మెంటల్ హెల్త్ ఎంతలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసా.. ఎంత బాధపడుతున్నానో తెలుసా" అంటూ పోస్ట్ ని షేర్ చేసింది సుప్రిత. కాగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.