English | Telugu
చాల మంది వెంటపడుతున్నారు..కానీ ఈయన మీదే నా కళ్ళు
Updated : Dec 4, 2023
అలీతో ఆల్ ఇన్ వన్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షోకి రౌడీ రోహిణ, కెవ్వు కార్తీక్ ఈ షోకి వచ్చారు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న కెవ్వు కార్తీక్ తో మాట్లాడాడు ఆలీ "ఎలా ఉంది లైఫ్ " అని అడిగేసరికి " బాగుంది సర్..అని చెప్పాలి కదా..అందుకే బాగుంది" అన్నాడు కార్తీక్..తర్వాత రౌడీ రోహిణి వచ్చింది స్టేజి మీదకు. "ఏంటి కొంచెం చిక్కినట్టున్నావ్" అని ఆలీ అడిగేసరికి "తెలుస్తోందా మీకు...కొంచెం చిక్కాను " అని రోహిణి చెప్పేసరికి "నీకే తెలియట్లేదు" అని కౌంటర్ వేసాడు కెవ్వు కార్తీక్. "బయట టాక్ ఏంటో తెలుసా..రోహిణి పెళ్ళెప్పుడు చేసుకుంటుంది అని అడుగుతున్నారు..వాళ్లకు నీ సమాధానం ఏమిటి" అని అలీ అడిగేసరికి "యాక్ట్యువల్ గా చాల మంది వెంటపడుతున్నారు" అని కామెడీ చేసింది రోహిణి.
తర్వాత రాకెట్ రాఘవ ఫుల్ గా డాన్స్ చేస్తూ వచ్చి స్టేజి మీద షర్ట్ విప్పేసి మరీ డాన్స్ చేసాడు. "ఈయన వచ్చిన దగ్గర నుంచి నాకు ఈయన మీదే కళ్ళు" అని రోహిణి రాఘవ మీద కామెంట్ చేసేసరికి "సర్ నాకు చాల సిగ్గేస్తోంది" అన్నాడు రాఘవ. ఇక రోహిణి షోలో ఇచ్చిన ఇమేజెస్ మీద ఒక కథ అల్లి చెప్పింది..."చేపలతో ఆడుకుంటూ పాపను పెట్టుకుంటున్నాడు" అనేసరికి ఆలీ అసలు ఊ కొట్టకుండా..అలా సైలెంట్ గా ఉండేసరికి "మీరు సరిగా ఫాలో అవ్వడం లేదు ..నాకు కథ చెప్పే ఇంటరెస్ట్ లేదు" అని రోహిణి చెప్పేసరికి "నాకు ఇప్పుడు అర్ధమయ్యింది టీం లీడర్ గా నిన్ను" అని ఆలీ కౌంటర్ వేసేసరికి రోహిణి నవ్వేసింది. ఏ షో చూసినా జబర్దస్త్ టీమ్ దుమ్ము రేపుతోంది.. అన్ని షోస్ ని చుట్టేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక లేడీ కమెడియన్స్ లో రోహిణి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉంది.