English | Telugu

దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు.. నాకు హెయిర్ తప్ప ఏమీ ఇవ్వలేదు!

కొందరంతే ఏం చెప్పిన ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే సీజన్-7 ఎంత ఫేమసో, కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ తర్వాత ఎగ్జిట్ ఇంటర్వ్యూ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలకి యాంకర్ గా గీతు రాయల్ చేస్తుంది. సీజన్-6 లో సూటిగా సుత్తిలేకుండా మాట్లాడేది తనే. ఎవరినైనా, ఏదైనా అడిగే గట్స్, దమ్మున్న ఏకైక కంటెస్టెంట్ గీతు రాయల్.

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. గీతు రాయల్ హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.

అయితే గీతు హౌస్ నుండి బయటకొచ్చాక సీజన్‌-6 కంటెస్టెంట్స్ ని కలిసి థాయ్ లాండ్ ట్రిప్ వెళ్ళింది. రెగ్యులర్ గా బర్త్ డే పార్టీలంటు, వీకెండ్ లలో వాసంతి కృష్ణన్ లని కలుస్తూ ఉంటుంది గీతు. ప్రస్తుతం గీతు బిగ్ బాస్ సీజన్-7 కి కంటెస్టెంట్స్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేస్తుంది‌. అవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కాగా ఇన్ స్టాగ్రామ్ లో తను మాట్లాడకుందామా అని చిట్ చాట్ చేసింది గీతు.

ఇందులో ఒకరు మీరు హౌస్ లో ఉన్నప్పుడు శత్రువుగా భావించి బయటకొచ్చాక ఫ్రెండ్ అయింది ఎవరైనా ఉన్నారా అంటే.. ఉన్నారు. ఇంకెవరు మన రాజాధి రాజా.. అంటు రాజ్ కి ట్యాగ్ చేసింది. మీ కుక్క ఓరొయో మీ నాన్న ఎలా ఉన్నాడని ఒకరు అడుగగా.. తన నాన్న హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వీడియో పెట్టింది గీతు. మీ హెయిర్ చాలా బాగుంది. సీక్రెట్ ఏంటని ఒకరు అడుగగా.. సీక్రెట్ ఏం లేదు. చిన్నప్పటి నుండి అంతే. ఆయిల్స్ కూడా ఏం వాడను. జెనెటిక్ వల్ల అంతే. కానీ ఈ బజ్ ఇంటర్వ్యూల వల్ల రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సి వస్తుంది. దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు. నాకు జుట్టు తప్ప ఏం ఇవ్వలేదని గీతు రిప్లై ఇచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్-6 లో తను బయటకు వస్తున్నప్పుడు చెప్పిన కొన్ని మాటలని వీడియో రూపంలో పోస్ట్ చేసింది గీతు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.