English | Telugu
గౌతమ్ కృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Updated : Dec 4, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో ఒక అన్ వాంటెడ్ , అన్ యూజ్ ఫుల్, అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ చివరి దాకా ఉన్నాడంటే అది గౌతమ్ కృష్ణ అని చెప్పొచ్చు.అశ్వగంధ అలియాజ్ గౌతమ్... హౌస్ లో మోస్ట్ అన్ డిజర్వింగ్ అని ఎవరైన ఉన్నారంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఈ గౌతమ్. హౌస్ లో పన్నెండు మంది హౌస్ మేట్స్ ఉన్నా, ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఉన్నా గౌతమ్ కి నామినేషన్ లో గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు శివాజీ. ప్రతీ వారం కారణం లేకుండా సిల్లీ రీజన్స్ తో శివాజీని నామినేట్ చేయడం, కంటెంట్ కోసం వాగ్వాదానికి దిగడం తప్ప ఒక్క గేమ్ లో కూడా గెలిచింది లేదు. ఆట ఆడింది లేదు, యాక్టివ్ పర్ఫామెన్స్ లేదు. ఇంకా ఎంచుకున్నాడంటే ఎలిమినేషన్ అవ్వడానికి ఇతర కంటెస్టెంట్స్ ఉండటమే కారణం లేదంటే నాలుగో వారంలోనే బయటకు వచ్చే కంటెస్టెంట్ గౌతమ్.
ఇక ఈ వారం హౌస్ లో ఏ పర్ఫామెన్స్ లేనిది గౌతమ్. నామినేషన్ లో అతితక్కువ పాయింట్లతో లీస్ట్ లో ఉన్నాడు. అయితే శోభాశెట్టి, ప్రియాంక కూడా లీస్ట్ లోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ సీరియల్ బ్యాచ్ కు ఫేవరిజం చూపిస్తాడని అందరికి తెలిసిందే. గత నాలుగు వారాల నుండి శోభాశెట్టి నామినేషన్ లో లీస్ట్ లో ఉన్న తనని బయటకి పంపివ్వలేదు బిగ్ బాస్. ఇక తన బదులు ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ బలైన విషయం తెలిసిందే. కాగా అనుకున్నట్టే గౌతమ్ కృష్ణని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు సీరియల్ బ్యాచ్ కి ఫేవరిజం చూపించిన గౌతమ్ ఎలిమినేట్ అవ్వడంతో స్పై అభిమానులు ఆనందంగా ఉన్నారు. వారానికి 1.5 లక్షల చొప్పున పదమూడు వారాలకి గాను 19.5 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా శివాజీతో గొడవ పెట్టుకోవడం గౌతమ్ కి పెద్ద మైనస్ అయి బయటకొచ్చాడనేది అందరికి తెలిసిన విషయం.