English | Telugu

నా కొడుకు వల్ల ఆ కడుపు రాలేదని తేల్చిచెప్పిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -269 లో... రాజ్ దగ్గర సెక్రటరీగా వర్క్ చేసే శృతి ఫోటోని కావ్య చూపించి.. మీ ఇద్దరి మధ్య సంబంధమేంటని అడుగుతుంది. ఒక ఎంప్లాయ్ , బాస్ కి ఏం సంబంధం ఉంటుందో అదే ఉందని అంతకు మించి ఏం లేదని రాజ్ అంటాడు.

మీ మధ్య ఏం లేదనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా అని కావ్య అడుగుతుంది. లేదంటే ఇంకా ఏం ఉంటుందని రాజ్ చిరాకు పడుతాడు. మరి మా అక్కని నిరూపించుకో అంటే తను ఎలా నిరూపించుకుంటుంది. మీరు ఒక ఫోటో చూసి అమ్మయిపై నిందలు వెయ్యవద్దని చెప్తున్నారు. మరి మీరు చేసిందేంటి? ఒక ఫోటో చూసి మా అక్కపై నిందలు వెయ్యడం లేదా అని కావ్య అంటుంది. శృతితో మీరు క్లోజ్ ఉంటే అది తప్పుకాదు. పైగా ఇలా అంటే మీకు కోపం వస్తుంది. మరి మా అక్కకి కోపం రాదా అని కావ్య అంటుంటే.. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. కాసేపటికి మీ అక్క డబ్బులు ఎందుకు ఇచ్చిందని అనగానే.. అది తింగరిది డబ్బుల కోసం వాడే బ్లాక్ మెయిల్ చేసాడని కావ్య చెప్తుంది. మరొకవైపు DNA టెస్ట్ చేసేవరకు ఎలాంటి గొడవలకి రాకూడదని చెప్పినా.. ఆ రుద్రాణి వినట్లేదు. శాంతని కాఫీ అడిగిందని అని స్వప్నతో గొడవపెట్టుకుంది రుద్రాణి. ఈ స్వప్న చెయ్యని తప్పుని నిరూపిస్తానని అంటుంది. తప్పు స్వప్న వైపు కూడా ఉందని ఏం అనలేక పోతున్నానని కావ్య దగ్గరకి ధాన్యలక్ష్మి వచ్చి చెప్తుంది.

ఆ తర్వాత కావ్యకి అరుణ్ ఉండే అడ్రెస్ తెలుస్తుంది. రాజ్ దగ్గరకి వెళ్లి.. మీరు నాతో పాటు అరుణ్ దగ్గరకి రావాలని రాజ్ తో కావ్య చెప్పగానే.. నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉందని అంటాడు. మీకు ఎప్పుడు ఆఫీస్ ఇంపార్టెంట్ అంటూ కావ్య కోపంగా వెళ్తుంది. కాసేపటికి కావ్యతో పాటు రాజ్ వెళ్ళాలని డిసైడ్ అయి.. ఆ విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతు తన వెనకాలే తిరుగుతు ఉంటాడు. రాజ్ అలా తిరగడం మొత్తం.. ఇంట్లో వాళ్ళంతా చూస్తూ ఉంటారు. కాసేపటికి నువ్వు బయటకి వెళదామని అన్నావ్ కదా? పదా అంటూ కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ తీసుకొని వెళ్తాడు. మరొకవైపు స్వప్న దగ్గరకి వెళ్లడనికి కనకం సిద్ధమవుతుంది. నిన్ను అందరి ముందు అవమానించకుండా చూసుకోమని కనకానికి కృష్ణమూర్తి చెప్తాడు. తరువాయి భాగంలో స్వప్న దగ్గరకి వచ్చిన కనకం.. నీ కూతురు తల్లి అవుతుంది కానీ నా కొడుకు తండ్రి అవట్లేదు. ఆ బిడ్డకి తండ్రి ఎవరో అని రుద్రాణి అనగానే.. కనకం షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.