English | Telugu
అన్వికకు లవ్ ప్రపోజ్ చేసి రెడ్ రోజ్ ఇచ్చిన జబర్దస్త్ నరేష్
Updated : Dec 3, 2023
బుల్లి తెర మీద జబర్దస్త్ షో ఎంత పోపులరో అందరికీ తెలుసు. ఈ షోలో చాలా మంది ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ లవర్స్ ఉన్నారు. వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలాగే చాలా మంది హీరోలు, డైరెక్టర్లు ఇలా అయ్యారు. అలాగే జబర్దస్త్ లో పొట్టి వాడైనా గట్టివాడుగా పేరు తెచ్చుకున్న నాటీ నరేష్ అంటే సెట్ లో అందరూ ఇష్టపడతారు. అలాంటి నరేష్ తన హైట్ ని పట్టించుకోకుండా ఎవరు ఎగతాళి చేసినా లైట్ తీసుకుంటూ ఆడియన్స్ ని నవ్విస్తూ ఉంటాడు. అలాంటి నరేష్ త్వరలో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. బుల్లితెర మీద చాలా షోస్ చేస్తున్నాడు నరేష్... డబ్బు బాగానే సంపాదించాడు ఇల్లు కూడా కొనుక్కున్నాడు.
ఇక పెళ్లే మిగిలింది అనుకుంటున్న టైములో ఆడియన్స్ కి గుడ్ న్యూస్ కూడా చెప్పేసాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వీక్ షోకి తన అందమైన లవర్ అన్వికను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసాడు. అలాగే వాళ్ళ నాన్నను కూడా తీసుకొచ్చాడు. ఆ అమ్మాయికి పువ్వు, రెడ్ హార్ట్ బెలూన్ ఇచ్చి ఐ లవ్ యు చెప్పాడు. ఈ రెండేళ్ల నుంచి తనకు అన్ లిమిటెడ్ లవ్ ని అందించాడంటూ ఆ అమ్మాయి కూడా నరేష్ గురించి సిగ్గు పడుతూనే చెప్పింది. ఇక నరేష్ వాళ్ళ నాన్నకు కూడా ఈ పెళ్లంటే ఇష్టం అని చెప్పాడు. ఇక నరేష్ తన కాబోయే వైఫ్ ఇద్దరూ కలిసి వాళ్ళ నాన్న కాళ్ళకు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అలా వాళ్ళ లవ్ లైఫ్ జర్నీ గురించి చెప్పారు. ఐతే ఈ విషయాలన్నీ ఆ ఇద్దరూ చెప్పేసరికి అందరూ నమ్మేశారు. ఇక చివరికి నరేష్ ఎగతాళిగా నవ్వుతూ ఉండేసరికి రష్మీకి డౌట్ వచ్చి మళ్ళీ అడిగింది. అప్పుడు నరేష్ అసలు నిజం చెప్పాడు. ఇదంతా ప్రాంక్. మా మధ్యన ఏమీ లేదు. అసలు మాది ఇన్స్టాగ్రామ్ లవ్ కానీ కాదు. జస్ట్ ఒక రోజు పరిచయమే. ఇక్కడ సరదాగా ప్రాంక్ చేద్దామని తీసుకొచ్చాను అని చెప్పేసరికి అందరూ షాకయ్యారు.