English | Telugu
గౌతమ్ ఎలిమినేటెడ్ .. మరోసారి దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడిన బిగ్ బాస్!
Updated : Dec 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పదమూడు వారాలు పూర్తిచేసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక టీఆర్పీ తెచ్చుకుంటున్న షో గా తెలుగు బిగ్ బాస్ షో నిలిచింది. ఇక సండే ఫన్ డే ఎపిసోడ్ లో గెస్ట్ నాని వచ్చాడు. తన ' హాయ్ నాన్న' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కి వచ్చిన నాని.. హౌస్ మేట్స్ తో చిట్ చాట్ చేశాడు. ఇక నాగార్జున తర్వాతి సినిమా ' నా సామి రంగ' మూవీ హీరోయిన్ స్టేజ్ మీదకి వచ్చింది. వచ్చి రాగానే అమర్ దీప్ కి ఓ కిస్ ఇవ్వగా.. గాల్లోకి ఎగిరి మరీ అందుకొని దాచుకున్నాడు. ఇక హౌస్ మేట్స్ తో కాసేపు చిట్ చాట్ చేసింది.
ఇక హౌస్ లో ఎవరేంటని? ఎవరు అన్ డిజర్వింగ్ అంటూ ఫిటింగ్ పెట్టాడు నాగార్జున. హౌస్ లో ఇప్పటివరకు జరిగిన వారాల్లో ఎవరు మీకు అన్ డిజర్వింగ్ అనిపించిందో వారికి రీజన్ చెప్పి అన్ డిజర్వింగ్ బ్యాండ్ ఇవ్వమన్నాడు నాగార్జున. ఇక నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్. మొదట ప్రియాంక సేవ్ అయింది. ఆ తర్వాత అంబటి అర్జున్ సేవ్ అయ్యాడు. యావర్, శివాజీ ఇలా ఒక్కొక్కరు సేవ్ అవ్వగా.. లాస్ట్ ప్రశాంత్, శోభాశెట్టి, గౌతమ్ ఉన్నారు. వీరిలో ప్రశాంత్ సేవ్ అయ్యాడు. ఇక చివరగా శోభాశెట్టి, గౌతమ్ ఉండగా శోభాశెట్టి సేఫ్, గౌతమ్ ఎలిమినేటెడ్ అని నాగార్జున చెప్పేశాడు.
మరోసారీ ఓట్ చేసిన ప్రేక్షకులకు అన్యాయం చేశాడు బిగ్ బాస్. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న శోభాశెట్టిని ఎలిమినేట్ చేయకుండా గౌతమ్ ని ఎలిమినేట్ చేయడంపై బయట జనాలు విమర్శిస్తున్నారు. ఇంకా ఎన్ని, ఎన్ని దారుణాలు చూడాలి సర్ అంటూ కామెంట్లతో తమ నిరసనని తెలుపుతున్నారు. ఇప్పటికే సీరియల్ బ్యాచ్ కి బిగ్ బాస్ సపోర్ట్ అంటు విమర్శలు వస్తుంటే ఆ నమ్మకాన్ని ఋజువు చేస్తూ .. దత్తపుత్రిక శోభాశెట్టిని కాపాడే ప్రాసెస్ లో భాగంగా మరో గొర్రె బలైంది. ఓటింగ్ ఆర్డర్ లో శోభాశెట్టి అతితక్కువ ఓటింగ్ తో లీస్ట్ లో ఉంది. కానీ గౌతమ్ ని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్. ఇది అన్ ఫెయర్ అంటూ కొందరు అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు.