English | Telugu

చెన్నైలో ఏడాది మొత్తం నీటి సమస్య ... డిసెంబర్ వస్తే నీరే పెద్ద సమస్య


నటి కస్తూరి అంటే చాలు సోషల్ మీడియాలో చాలా మందికి భయం. ఎందుకంటే తన మీద కామెంట్స్ చేసేవాళ్లకు సూపర్ హాట్ గా చాలా ఘాటుగా నవ్వుతూ రిప్లై ఇచ్చిపడేస్తుంది. కస్తూరి డైలీ ఇన్సిడెంట్స్ మీద కచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాటికి తగ్గ కామెంట్స్ కూడా పెడుతుంది. ఐతే ఇప్పుడు కూడా అలాంటి ఒక పోస్ట్ పెట్టింది. మిచాంగ్ తుపాను చెన్నైని చుట్టు పక్కల ప్రాంతాల్ని ఎంత అతలాకుతలం చేసేసిందో అందరికీ తెలిసిన విషయమే. చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీళ్లు నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కస్తూరి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో వర్షం ఫోటో పెట్టి దాని పైన "చెన్నైలో ఏడాది మొత్తం ...నీటి సమస్య ...అదే డిసెంబర్ నెల వస్తే నీరే పెద్ద సమస్య" అంటూ ఒక ప్రతీ ఏడాది జరిగే విషయాన్నీ చాల సింపుల్ గా రెండు వాక్యాల్లో అద్భుతమైన కోట్ ని పోస్ట్ చేసింది.

ఇక ఆ రెండు లైన్లు చదివిన నెటిజన్స్ ఆమె రైటింగ్ స్కిల్స్ ని అభినందిస్తున్నారు. ఏముంది మీ రైమింగ్, పర్ఫెక్ట్ గా చెప్పారు...ప్రతీ సంవత్సరం డిసెంబర్ రాగానే ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. అలాగే మరో వైపు అనసూయ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో "చెన్నై..నీ గురించి చాలా ఆందోళనగా ఉంది.. ప్లీజ్ సేఫ్ గా స్ట్రాంగ్" గా ఉండు అని కామెంట్ పెట్టేసరికి నెటిజన్స్ రెచ్చిపోయారు. కొంతమంది ఆమె కామెంట్ కి థ్యాంక్స్ చెప్తే ఇంకొంతమంది మాత్రం ఆంధ్రాలో ఉన్న నెల్లూరు, తిరుపతి గురించి మీకు బాధగా లేదా.. హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదు ? అని క్వశ్చన్ చేస్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.