English | Telugu

Brahmamudi: నీ కూతురు తల్లి అయింది కానీ దానికి కారణం నా కొడుకు కాదు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -270 లో... స్వప్న దగ్గరికి కనకం వెళ్లడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. అయిన కనకం ఎలాగైనా స్వప్న వంకతో అప్పు కళ్యాణ్ లకి పెళ్లి చెయ్యాలని నిర్ణయం తీసుకొని స్వప్న దగ్గరికి బయలుదేరుతుంది. తనతో పాటు అప్పుని తీసుకొని వెళ్ళాలని అనుకుంటుంది కానీ అప్పు వెళ్లడానికి ఇష్టపడదు.

మరొకవైపు కావ్య, రాజ్ లు అరుణ్ ని వెతుక్కుంటు తన ఇంటికి వస్తారు. కానీ అరుణ్ తన మనిషితో కొన్ని రోజుల వరకు బయటకు వెళ్ళానని, ఎవరు వచ్చిన ఇంట్లో లేనని ముందే చెప్పి ఉంచుతాడు. ఇక రాజ్, కావ్య వచ్చి అతన్ని అడుగగానే.. ఇంట్లో అరుణ్ లేడని, బట్టలు సర్దుకుని ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్తాడు. ఎక్కడ ఉన్నాడో చెప్పమంటూ కావ్య అతన్ని ఒక ఆట ఆడుకుంటుంది. ఎంత అడిగిన అతను చెప్పకపోయేసరికి తిరిగి వెళ్ళిపోతారు. మరొకవైపు రాహుల్ కి అరుణ్ ఫోన్ చేసి.. రాజ్ , కావ్య వచ్చిన విషయం చెప్తతాడు. నేను చెప్పేంత వరకు బయటకు రాకు అంటూ రాహుల్ చెప్తాడు. అదే విషయం రుద్రాణికి చెప్తాడు. అప్పుడే అటో దిగి వస్తున్న కనకాన్ని చూసి టైమ్ కి వచ్చింది. కూతురు చేసిన గనకార్యం గురించి చెప్పాలని రుద్రాణి అనుకుంటుంది.

మరొకవైవు రుద్రాణి వెళ్లి.. స్వప్నతో గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. అప్పుడే స్వప్న దగ్గరికి వచ్చి కనకం వచ్చి.. నువ్వు తల్లివి కాబోతున్నావని చాలా సంతోషంగా ఉందని కనకం అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న రుద్రాణి.. " నీ కూతురు తల్లి అవుతుంది. నా కొడుకు తండ్రి అవడం లేదు" ఇంకా ఎవడో తండ్రి అవుతున్నాడు" అని రుద్రాణి అనగానే.. కావ్య షాక్ అవుతుంది. అప్పుడే కావ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు మొత్తం చెప్తుంది. నా కూతురు అసలు తప్పు చెయ్యదని కనకం చెప్తుంది. కావాలనే కనకం నటిస్తు స్వప్నని తీసుకొని వెళ్లిపోతానని అంటుంది. కానీ స్వప్న రానని అంటుంది. కనకం కూడా స్వప్న అత్తవారింట్లోనే ఉండాలని మనసులో అనుకుంటుంది. తరువాయి భాగంలో.. అనామిక పేరెంట్స్ దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు కలిసి అనామిక, కళ్యాణ్ లకి పెళ్లి చెయ్యాలని జాతకాలు చూస్తారు. అనామిక జాతకం కలవడం లేదని పంతులు గారు చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.