English | Telugu
Krishna Mukunda Murari:కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో బిగ్ ట్విస్ట్.. అది జరిగేనా?
Updated : Dec 4, 2023
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -331 లో.. భవాని ముకుంద, మురారి కలిసి రెస్టారెంట్ నుండి ఇంటికి వస్తారు. మురారి మాత్రం కోపంగా వెళ్తాడు. ఆ తర్వాత హాల్లో కూర్చొని ఉన్న భవాని దగ్గరికి మధు వచ్చి.. వెడ్డింగ్ కార్డ్స్ మోడల్స్ తీసుకొని ఒకతను వచ్చాడని చెప్తాడు. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ముకుంద సెలెక్ట్ చేస్తుంది.
ఆ తర్వాత కార్డ్స్ బాగున్నాయా అంటూ భవాని రేవతిని అడుగుతుంది. రేవతి ఇష్టం లేకున్నా బాగున్నాయని చెప్తుంది. మరొకవైపు కృష్ణ ఇంటికి హ్యాపీగా రావడం చూసి.. ఏమైంది అంత సంతోషంగా ఉన్నావని శకుంతల అడుగుతుంది. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వస్తుందని కృష్ణ చెప్తుంది. దానికి శకుంతల సంబరపడుతుంది. ఆ తర్వాత కృష్ణ జరిగింది అంతా కూడా శకుంతలతో చెప్తుంది. ఆ తర్వాత రేవతి దగ్గరికి కృష్ణ వస్తుంది. ఏసీపీ సర్ కీ గతం గుర్తుకు వస్తుందని కృష్ణ చెప్పగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీనివాస్ ఇంట్లో జరిగింది, రెస్టారెంట్ లో జరిగింది మొత్తం కృష్ణ చెప్పగానే.. రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు రెస్టారెంట్ లో జరిగింది గుర్తుకు చేసుకుంటుంది భవాని. అప్పుడే భవాని దగ్గరికి మురారి వస్తాడు. ఒక తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చినట్లు మీరు నన్ను చూస్తున్నారు. అసలు నేను గతంలో నేను ఏంటి అసలు? ఏం చేస్తూ ఉండేవాడిని అని భవానిని మురారి అడుగుతాడు. ఆ తర్వాత ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలని భవాని అనుకొని.. నువ్వు ఇంతకు ముందు మన బిజీనెస్ లు అన్ని చూసుకునేవాడివని అనగానే.. మరి ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారని మురారి అడుగుతాడు. మీ డాడ్ చూసుకుంటున్నాడని భవాని చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణ దగ్గరికి మురారి వచ్చి మాట్లాడతాడు. మురారి గురించి కృష్ణ గొప్పగా చెప్తుంది. మరొకవైపు భవాని తన ఫ్రెండ్స్ కి పెళ్లి కీ రమ్మని ఆహ్వానిస్తుంది.. తరువాయి భాగంలో పెళ్లి పత్రికలు తీసుకొని భవాని కృష్ణ దగ్గరికి వచ్చి నీకే మొదటి శుభలేఖ అని ఇవ్వగానే కృష్ణ శకుంతల షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.