English | Telugu
ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో... కీర్తిభట్ స్వీట్ వార్నింగ్
Updated : Dec 4, 2023
ఎన్నో కష్టాలను దాటిన బుల్లితెర నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తన కుటుంబ సభ్యులను కోల్పోవడమే కాక తాను పిల్లల్ని కనే భాగ్యానికి కూడా దూరమయ్యింది. ఐనా ఎక్కడా అధైర్యపడకుండా తన పని తాను చేసుకుపోతున్న టైంలో తనకి కాబోయే వరుడు కార్తీక్‌ని స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే 'మా బోనాల జాతర' స్పెషల్ ఈవెంట్‌లో పరిచయం చేసింది అలాగే ఆ స్టేజి మీద నిశ్చితార్ధం చేసుకుంది.
అలాంటి కీర్తి ఇప్పుడు ఒక నెటిజన్ అన్న మాటకు బాగా కోపం తెరుచుకుంది. నెటిజన్స్ ఆమెను కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి ఆన్సర్స్ ఇచ్చింది కీర్తి ఐతే అందులో ఒక వ్యక్తి మాత్రం "ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావ్" అని పేరు పెట్టకుండా అడిగేసరికి "ఫస్ట్ నీ పేరు పెట్టుకో నాన్న ఒక మంచి పేరు మీ నాన్న పెట్టి ఉంటారు కదా ..లేనిపోని ఓవర్ యాక్టింగ్ అంతా నీ పేరు పెట్టకుండా చేస్తున్నావ్...ఓవర్ యాక్టింగ్ తగ్గించుకో" అంటూ నవ్వుతూ ముద్దుగా మొట్టికాయ వేసింది. "కార్తీక్ సర్ యాక్టర్ కదా" అనేసరికి "యాక్టర్ కం డైరెక్టర్" అని ఆన్సర్ ఇచ్చింది.
"మీ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు" అని అడిగేసరికి "ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. డేట్ ఫిక్స్ చేసాక దాని మీద ఒక వ్లగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను" అని చెప్పింది. "మీ వయసెంత అక్క" అనేసరికి "1998 లో పుట్టాను లెక్కేసుకోండి" అని చెప్పింది. "అమర్ ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు" అనేసరికి "ఒక పోస్ట్ చూసి సపోర్ట్ చెయ్యట్లేదు అనుకోకండి.. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా నేను సపోర్ట్ చేస్తున్నాను" అని క్లారిటీ ఇచ్చింది కీర్తి భట్. "శ్రీహన్ కి నీకు మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగుండేది బీబీ హౌస్ లో" అనేసరికి "రీసెంట్ గా మానస్ పెళ్ళిలో శ్రీహన్ ని కలిసాను అది గేమ్ కాబట్టి ఆ టైంకి సరదాగా అలా ఫైట్ చేసుకున్నాము అంతే ఇప్పుడంతా ఏమీ లేదు" అని చెప్పింది.