English | Telugu

బిటెక్ వర్సెస్ రైతుబిడ్డ నామినేషన్ రిపీట్!

బిగ్ బాస్ సీజన్-7 లో ఎవరి ఊహకందని ట్విస్ట్ లు , ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. పద్నాలుగవ వారం నామినేషన్ ల డిస్కషన్ చూస్తే బుర్రపాడవ్వాల్సిందే. ఎవరు ఎవరికి ఎలవేషన్ ఇస్తున్నారో, ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ప్రేక్షకులు.

బిగ్ బాస్ మొదటి ప్రోమోలో యావర్, శోభాశెట్టి హైలైట్ గా నిలిస్తే.. సెకండ్ ప్రోమో రైతుబిడ్ వర్సెస్ బిటెక్ బాబు ఆర్గుమెంట్ తో హీటెక్కిపోయింది. ఎవర్రా నువ్వు అని అమర్ దీప్.. రా అనొద్దు అన్న అని ప్రశాంత్ అంటు నామినేషన్ ప్రక్రియ మొదలైనట్టుంది. మాటల తూటాలు బిగ్ బాస్ హౌస్ లో టాపాసుల్లా పేలినట్టు ఈ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. నా తమ్ముడిని ఎలాగైనా పిలుస్తా.. నచ్చితే పలుకు లేకపోతే పో అంటూ అమర్ దీప్ హైపర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ అమర్ కోసం మాటిచ్చాడు.. అంటూ పాత విషయాలు తవ్వాడు అమరదీప్. అందుకే కదా అన్న నిన్ను నేను గేమ్‌లో కొట్టానా అంటూ ప్రశాంత్ డిఫెండ్ చేసుకున్నాడు. అయితే అమర్, ప్రశాంత్ నామినేషన్ మధ్యలో శోభా దూరి.. "ఆ రోజు చెప్పాను.. ఈ రోజు చెబుతున్నాను. హౌస్‌లో సేఫ్ ప్లేయర్ పల్లవి ప్రశాంతే" అంటూ శోభాశెట్టి అంది. అలానే ప్రశాంత్ చెప్పే డైలాగులు చెబుతు తనని వెక్కిరించింది శోభాశెట్టి.


యావర్, అర్జున్ ల మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగినట్టు తెలుస్తుంది. తన సెకెండ్ నామినేషన్ గా అమర్ దీప్ ని అర్జున్ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు అమర్, ప్రశాంత్ లు ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ డిస్కషన్ సాగుతుండగా.. అమర్ కి చిరాకేసి చేతిలో ఉన్న సుత్తి నేలకోసి కొట్టేసి.. ఛీ ఆపరా నీ అబద్ధాలు అంటూ పక్కకిపోయాడు. " నీ కోసం నిలబడినోళ్లని మోసం చేసే గుణం నీదే" అంటూ ప్రశాంత్ అన్నాడు. అమర్ అన్న నన్ను ఎట్లా చేశాడో మీరే చూశారంటూ ఆడియన్స్‌కి చెప్పుకున్నాడు ప్రశాంత్. అది విని అమర్ దీప్.. " అవును నన్ను బయటికి పంపించేయండి, వాడికి కప్పు ఇచ్చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండండి" అంటూ హైపర్ అయ్యాడు అమర్ దీప్. మరోసారి రైతుబిడ్డ వర్సెస్ బిటెక్ బాబు నామినేషన్ అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది.


Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.