English | Telugu

బిగ్ బాస్ సీజన్ 7 లో ఆఖరి నామినేషన్స్.. ఎవరు తగ్గలేదుగా!

బిగ్ బాస్ సీజన్-7 లో పద్నాలుగవ వారం నామినేషన్ ప్రక్రియతో హీటెక్కిపోయింది. ఇదే మా చివరి పర్ఫామెన్స్ అన్న రేంజ్ లో ప్రతీ ఒక్క కంటెస్టెంట్స్ చెలరేగిపోయారు. యావర్, అర్జున్ ల మధ్య నామినేషన్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. గేమ్ లో ఫౌల్ చేసావని అర్జున్ ని యావర్ అనగా.. నువ్వు కూడా ఫౌల్ చేసావ్ కదా అని అర్జున్ ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్రంగా అరుచుకున్నారు.

కెప్టెన్సీ టాస్క్‌లో అమర్‌ దీప్‌కి ఇచ్చిన మాట ప్రకారం ప్రశాంత్ తన మీద ఒక్క బాల్ కూడా విసరకుండా సపోర్ట్ చేశాడు. అయితే ఆ తరువాతి వారంలో కూడా.. అమర్ దీప్ ఫొటోని కాల్చకుండా వదిలేసి.. రైతు బిడ్డ మాటిస్తే తప్పడని మాట నిలబెట్టుకున్నాడు. కానీ.. అమర్ దీప్ నమ్మించి మోసం చేశాడు. ఆ తరువాతి వారంలోనే ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. తనని కెప్టెన్‌ని కాకుండా అడ్డుకున్న వాళ్లని వదిలేసి.. సపోర్ట్ చేసిన ప్రశాంత్ నామినేట్ చేయడంతో అమర్ సేఫ్ గేమ్ ఆడాడని ప్రశాంత్ నమ్మించి మోసం చేశాడని, బయట వాళ్లే కాదు.. హౌస్‌లో ఉన్న వాళ్ళు కూడా అనుకున్నారు.

" నేను అసలు నామినేషన్స్ గురించే మాట్లాడటం లేదన్నా.. నువ్వు చేసిన నమ్మకద్రోహం గురించి మాట్లాడుతున్నా " అని ప్రశాంత్ అన్నాడు. ‘పోరా’.. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా? అని అమర్ దీప్ అనగానే.. ‘‘చూడన్నా.. నన్ను రారా పోరా అనొద్దు.. నువ్వు నన్ను రా అని అనకు.. పేరు పెట్టి పిలువు" అని అన్నాడు. ఆ మాటతో అమర్ రెచ్చిపోయాడు. ‘నేను రా అనే అంటా ఏం చేస్తావ్? నా తమ్ముడిని రా అనే అంటాను. పలికితే పలుకు లేదంటే లేదు" అని అమర్ దీప్ అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య కొట్టుకునేదాకా వచ్చారు. ఇక ప్రశాంత్ ని అమర్ దీప్ తిడుతుంటే శోభాశెట్టి మరింత రెచ్చగొట్టడానికి పుల్లలు పెట్టింది. మరోవైపు ప్రియాంక, శివాజీల మధ్య వాగ్వాదం జరిగింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.