English | Telugu

నితిన్ భార్య డేంజర్ పిల్ల అంటున్న వక్కంతం వంశీ!

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ షోకి ప్రొమోషన్స్ కోసం "ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్" మూవీ టీం నుంచి దర్శకుడు వక్కంతం వంశీ, హీరో నితిన్, నటుడు బ్రహ్మాజీ, హైపర్ ఆది వచ్చారు. ఇక బ్రహ్మాజీ, హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ ఫుల్ కామెడీ ఉంటుందన్న విషయం మనందరికీ తెలుసు..అలాగే ఈ షోలో కూడా కామెడీ ఫుల్ గా ఉండబోతోందనే సంగతి ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఈ షోకి వచ్చిన మూవీ టీమ్ అంతా నార్మల్ గా వస్తే బ్రహ్మాజీ మాత్రం బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని వచ్చాడు..ఇక నితిన్ కూడా ఈ పాయింట్ మీద కౌంటర్ కూడా వేసాడు. "మేం ముగ్గురం ఈ షోకి నార్మల్ గా వచ్చాము..ఈయనేందుకు కళ్ళజోడు పెట్టుకున్నారు...కళ్ళ కింద క్యారీ బాగ్స్ ని దాచుకోవడానికా" అంటూ కామెడీ కౌంటర్ వేశారు.

ఇక హైపర్ ఆది మధ్యలో వచ్చి "బ్రహ్మాజీ గారిని మీరంతా తక్కువంచనా వేయకండి...ఆయన కూడా నెక్స్ట్ ఒక షో చేయబోతున్నాడు. మీది సుమా అడ్డా ఐతే ఆయనది ఇందిరానగర్ గడ్డ" అని అనేసరికి "ఇందిరానగర్ గడ్డయితే పర్లేదు..సెగ్గడ్డ కాకుండా చూసుకుంటే చాలు" అని సుమారు రివర్స్ పంచ్ వేసి పడీ పడీ నవ్వేసింది. ఇక ప్రోమో లాస్ట్ లో హీరో నాని అతని భార్య గురించి ఒకరు దసరా, ఒకరు దీపావళి అని చెప్పాడు. తర్వాత నితిన్ తన వైఫ్ తో ఉన్న ఫోటోని ప్లే చేశారు. "ఒక్క మాటలో మీ ఆవిడ గురించి" అని సుమ అడిగేసరికి "ఆమె గురించి ఏముంది ఎక్స్ట్రా ఆర్డినరీ" అని చెప్పేసరికి "బయటకు ప్రతీ వైఫ్ గురించి ఎక్స్ట్రా ఆర్డినరీ చెప్పాలి మొబైల్ లో మాత్రం డేంజర్ పిల్ల అని ఫీడ్ చేసుకోవాలి" అంటూ వక్కంతం వంశీ నితిన్ నిజాన్ని రివీల్ చేసేసాడు. ఇక నితిన్ షోలో అతన్ని ఏమీ అనలేక "అంతేగా..అంతేగా" అనేసి సైలెంట్ గా ఉండిపోయి..ఎందుకురా బాబు నిజాన్ని ఇలా లీక్ చేసావ్ అన్నట్టుగా తలాడించేసుకున్నాడు నితిన్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.