English | Telugu

గోవా బీచ్ లో కొత్త బ్యూటీ అందాల ఆరబోత!

సెలబ్రిటీలు ఏం చేసిన ట్రెండింగ్ అవుతాయి. అయితే వీరిలో కొందరు అందంతో, మరికొందరు రీల్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సినిమా ఆడియో రిలీజ్ లకి, బుల్లితెరపై ప్రసారమయ్యే టీవీ షోలకి యాంకరింగ్ చేసే యాంకర్స్ కి మంచి క్రేజ్ ఉంది. ఫీమేల్ యాంకర్స్ లో సుమ, అనసూయ, రష్మి తర్వాత ఎవరు అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. అనసూయ ఎప్పుడైతే యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పేసిందో అప్పటి నుంచి కొత్త యాంకర్లకి ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. అందులో యాంకర్ స్రవంతి ఒకరు.

యాంకర్ స్రవంతి.. పూర్తిపేరు చొక్కారపు స్రవంతి. ఈ బ్యూటీ తాజాగా యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకి యాంకరింగ్ చేస్తుంది. అలానే అవకాశం ఉన్న ప్రతి సారి కొన్ని టీవీల పండగ షోస్‌లో కూడా మెరుస్తుంది. సంతోషం అవార్డ్స్ 2023'.. కి యాంకర్ గా చేస్తున్నట్టు ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా హీరో నానితో రీల్ చేసి మరో వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. దానికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి.

ఎప్పుడు ఫోటో షూట్, రీల్స్ అంటూ ఏదో ఒకటి షేర్ చేస్తూ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా గోవా బీచ్ లో బ్యూటీ నెటిజన్లకి హాట్ ట్రీట్ ఇచ్చింది. వలలాంటి పొట్టి డ్రెస్ తో కుర్రకారుని వలలో పడేస్తుంది. గోవా బీచ్ లోని ఇసుకపై కూర్చొని అందాలు ఆరబోయడంతో.. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. " జస్ట్ ఏ టాన్ టాస్టిక్ డే " అంటూ ఈ పోస్ట్ కి టైటిల్ కూడా ఇచ్చేసుకుంది ఈ బ్యూటీ. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.