English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో బాలకృష్ణ.. విజిల్ వేసిన శివాజీ!

బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. రోజు కొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ ని ఫుల్ ఆడేసుకుంటున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే పదమూడు వారాలు పూర్తిచేసుకొని పద్నాలుగవ వారంలోకి అడుగుపెట్టారు కంటెస్టెంట్స్. ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నారు.

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా మొదటిసారి రెండువారాల పాటు టైటిల్ విన్నర్ కి ప్రేక్షకులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించాడు. ఇప్పటికే ఈ ఓటింగ్ లో శివాజీ నెంబర్ వన్, రెండవ స్థానంలో ప్రశాంత్ కొనసాగుతున్న విషయం తెలిసిందే‌. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రతీ వీకెండ్ ఎవరో ఒకరు గెస్ట్ లుగా వస్తుంటారు. ప్రతీ పండుగను సెలబ్రేట్ చేస్తారు బిగ్ బాస్. అలాగే మొన్నటి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా వరుసగా ఏడు మ్యాచ్ లు గెలిచిదంటూ.. బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ కి చెప్పి వారి చేత ఆల్ ది బెస్ట్ చెప్పించాడు బిగ్ బాస్. ఇలా ప్రతీ ఇంపార్టెంట్ రోజుని హౌస్ లో ప్రతిష్టాత్మకంగా ప్రదర్శిస్తూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంటుంది బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లోకి బాలకృష్ణ వచ్చేశాడు. బాలకృష్ణని చూసి కేకలతో, అరుపులతో హౌస్ అంత ' జై బాలయ్య' నినాదంతో మారుమ్రోగింది. ఇక శివాజీ అయితే విజిల్ వేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలని ఇష్టపడే శివాజీ.. బాలయ్య బాబు ఫ్యాన్ అని దీన్ని బట్టే తెలుస్తుంది. అసలు హౌస్ లో ఏం జరిగిందంటే.. నేడు ప్రో కబడ్డీ లీగ్ లో కబడ్డీ మ్యాచ్ జరగబోతుంది.‌ ఇందులో మన తెలుగు టైటాన్స్ కి పట్నా పైరేట్స్ కి మధ్య మ్యాచ్ ఉంది. మన టీమ్ గెలవాలని కోరుకుంటున్నామంటూ బిగ్ బాస్ టీవీలో బాలయ్య బాబు అడ్విటైజింగ్ చూపించాడు. ఇక తెరమీద బాలయ్య బాబుని చూసిన హౌస్ మేట్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరు తెలుగు టైటాన్స్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ.. గెలవాలని విష్ చేసారు. ఇది నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.