English | Telugu
Krishna Mukunda Murari:ప్రియురాలితో పెళ్ళి.. భార్యతో కొత్తగా మొదలైన జర్నీ!
Updated : Dec 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -332 లో.. భవాని తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి పెళ్లికి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరికి పెళ్లి పనులు అప్పజెప్తుంది. కానీ ఇంట్లో అందరు డల్ గా ఉంటారు. ఇలా డల్ గా ఉండకండి అని భవాని చెప్తుంది. పెళ్లికి అన్ని సిద్ధం చేస్తున్నారు కానీ అసలు మురారికి ఈ పెళ్లి ఇష్టమో కాదో తెలియదు. ఎందుకు అంటే ఇప్పుడు మురారి ఆ కృష్ణ దగ్గరే ఉన్నాడని సుమలత చెప్తుంది.
ప్రస్తుతం మురారి గతం మర్చిపోయి ఉన్నాడు ఈ పరిస్థితిలో ముకుందతో పెళ్లి చేస్తే కొన్ని రోజుల తర్వాత గతం గుర్తుకు వచ్చి కృష్ణ దగ్గరికి వెళ్తే ముకుంద పరిస్థితి ఏంటి అని ప్రసాద్ అంటాడు. ఇలా అందరూ తమ అనుమానాలు చెప్తుంటారు. అవన్నీ విన్న భవానికి కోపం వస్తుంది. ఆపండి అందరు.. అసలు కృష్ణ మురారిలది పెళ్లి కాదు.. అగ్రిమెంట్ మ్యారేజ్. అని వాళ్లకి అర్థం అయ్యేల భవాని చెప్తుంది. మరొక వైపు కృష్ణ దగ్గర మురారి మాట్లాడుతుంటాడు. నేను ఎలా కృష్ణపై ఇష్టంగా ఉన్నానో తనకి కూడా నేను అంటే ఇష్టమని మురారి అనుకుంటాడు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంగా ముకుంద వచ్చి.. మీ పెద్దమ్మ పిలుస్తుందని మురారికి చెప్తుంది. మురారి హ్యాపీగా కృష్ణకీ గుడ్ నైట్ చెప్తూ వెళ్తాడు. ఏంటి మురారి ఇంత హ్యాపీగా ఉన్నాడని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత మురారి తన గదిలో కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్, నందు ఇద్దరు మురారి దగ్గరికి వచ్చి మాట్లాడుతారు. నాకు ఈ మధ్య కొన్ని పదాలు గుర్తుకు వస్తున్నాయి. అవి నేను వాడాను అని అనిపిస్తుందని అనగానే నువ్వు మెల్లిగా అలోచించి.. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడానికి నేను కృష్ణ ఉన్నామని గౌతమ్ చెప్తాడు.
ఆ తర్వాత అందరూ రెడీ అయి హాల్లోకి వస్తారు. అందరికి రేవతి కాఫీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత సందడిగా ఉందోనని భవాని చెప్తుంది. కాసేపటికి ముకుందని మురారి పక్కన కూర్చొమని భవాని చెప్తుంది. ముకుంద వెళ్లి మురారి పక్కన కూర్చొని ఉంటుంది. మురారి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. మురారి కాఫీ కప్ అక్కడే పెట్టావ్ అని రేవతి అనగానే.. మురారి లేచి వచ్చి కప్ రేవతికి ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వెడ్డింగ్ కార్డుని మురారికి చూపిస్తుంది భవాని. మీరు సింపతీతోనే ఈ పెళ్లి చేస్తున్నారా అని మురారి అనగానే.. అందరూ షాక్ అవుతారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.