English | Telugu

ఓటింగ్ లో ప్రశాంత్, శివాజీల దూకుడు!

బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ఉత్కంఠ పెరిగిపోతుంది. కంటెస్టెంట్స్ ఆటతీరు, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లతో హౌస్ లో డ్రామా నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో శోభాశెట్టి, యావర్ గెలిచిన ఓట్ అప్పీల్ లో కన్నింగ్ అర్జున్ సీరియల్ బ్యాచ్ కి చేసిన ఫేవరిజం వల్ల, ఇంత కుళ్లుని దాచుకున్నాడా అర్జున్ అంటు జనాలంతా తిడుతున్నారు.

అర్జున్ నిన్నటి ఎపిసోడ్ లో యావర్ స్ట్రాంగ్ అంటునే శోభాశెట్టికి మద్దతు ఇవ్వడంపై వీడేంటి ఇంత దారుణంగా మోసం చేశాడని అనుకుంటున్నారు. ఫినాలే కి వెళ్ళాడనే ధీమాలో అర్జున్ నిజస్వరూపం బయటకొస్తుందని ఆడియన్స్ కి ఇప్పటికి అర్థం అవుతుంది. అర్జున్ కన్నింగ్ గేమ్ వల్ల గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. గత ఆరు వారాల నుండి ప్రేక్షకులు శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేయకుండా ఉంటే బిగ్ బాస్ మామ.. దత్తపుత్రికని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ శోభాశెట్టి కోసం బిగ్ బాస్ చేస్తున్న హైటెన్షన్ డ్రామా చూసిన జనాలు.. ఏందిరా సామి ఈ రచ్చ.. ఏ కుళ్లు, కుతంత్రాలు తెలియని యావర్ ని టార్గెట్ చేస్తారా ఏంటని అనుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ లో యావర్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నాడు.

ప్రియాంక, శోభాశెట్టి అట్టడుగున ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. అయితే వారిద్దరి పైన అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కి పడే ఓట్లని చూస్తుంటే అవన్నీ పీఆర్ ఓట్లలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమర్ దీప్ ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడింది లేదు. అయినా ఓట్లు పడుతున్నాయంటే అవి పీఆర్ స్టంట్సే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ మామ ఈసారి అయిన ప్రేక్షకులు ఓసే ఓటింగ్ కి ప్రాముఖ్యత ఇచ్చి ప్రియంక, శోభాశెట్టిలలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా లేక వారిద్దరి కోసం యావర్ ని బలి చేస్తాడా చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో.. వంద శాతం ఓటింగ్ పడితే అందులో 40 శాతం ఓటింగ్ ప్రశాంత్ కి పడుతుంది. ఆ తర్వాత స్థానంలో ఉన్న శివాజీకి ప్రశాంత్ కి 35 శాతం ఓటింగ్ పడుతుండగా.. మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్ కి 15 శాతం ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత 13 శాతం ఓటింగ్ తో యావర్ ఉన్నాడు. ఇక ప్రియాంక, శోభాశెట్టి లకి 4 నుండి 6 శాతం వరకు ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఎవరైతే టాప్ లో ఉంటారో వారే విజేత. ఇదే జరిగితే శివాజీ, ప్రశాంత్ లకే ఈ సారి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి లీస్ట్ లో ఉన్న శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరిలో ఈ వారంలో ఎవరు బయటకు వస్తారో చూడాలి మరి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.