English | Telugu

ఓట్ అప్పీల్ పేరుతో‌ అర్జున్ కు చుక్కలు చూపించిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఫన్ గేమ్ అంటు రెండు బ్యాచ్ ల మధ్య చిచ్చుపెడుతున్నాడు బిగ్ బాస్. ఒక్కో టాస్క్ కి ఒక్కో గొడవ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రెండవ కంటెండర్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు గాను ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో‌ హౌస్ లోని వారందరిని తోసుకొని వచ్చి గంట కొట్టి అర్హత సాధించాడు అర్జున్.

దీంతో తనని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు బిగ్‌బాస్. తీరా వచ్చిన తర్వాత ఎదురుగా క్లాత్స్ కప్పేసిన రెండు ప్లేట్స్ ఉంచి, అందులో నీకు నచ్చినది ఎంచుకోమని బిగ్‌బాస్ కోరాడు. దీంతో ఒక క్లాత్ తీసి చూస్తే ఆ కప్పులో మూడు పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి. ఇదేంటి బిగ్‌బాస్ అని అర్జున్ అడుగగా.. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావాలంటే ఆ మూడు పచ్చి ఉల్లిపాయలని పది నిమిషాల్లో తినాలని, లేకపోతే రెండో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముంటే అది చేయాలనే కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక అది విని.. వద్దు బిగ్‌బాస్ ఇవే తినేస్తానని మొత్తానికి అర్జున్ ఎలాగోలా వాటిని తిన్నాడు. అయిన ఈ మధ్య ఫుడ్‌కి సంబంధించిన టాస్కులన్నీ మీకే వస్తున్నాయ్ ఎందుకని అనుకుంటున్నారు అర్జున్ అని బిగ్ బాస్ అడిగాడు. "చూడటానికి దున్నపోతులా ఉన్నాను కదా తింటానని మీ అభిప్రాయం బిగ్‌బాస్" అని అర్జున్ అన్నాడు.

ఇక మరో మూసి ఉన్న క్లాత్ ని ఓపెన్ చేయమంటాడు. అందులో ఆరు ఉల్లిపాయలు‌ ఉంటాయి. వామ్మో అని దండం పెడతాడు అర్జున్. కాస్త స్వీట్ ఇప్పించండి బిగ్ బాస్ అని అర్జున్ అడుగగా.. స్వీట్ తినడానికి ఇష్టపడతారా? లేక స్వీట్ లాంటి కేక్ పంపించమంటారా అని బిగ్ బాస్ అడుగుతాడు. అతిగా తింటే ఏదైనా దారుణమే బిగ్‌బాస్. నేను రెండు ఎంచుకోను అంటూ అర్జున్ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఇచ్చిన టైమ్ లోపే టాస్క్ పూర్తి చేశాడు అర్జున్. దీంతో మీరు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ముందుకు వెళ్లారు.. కంగ్రాట్స్ అని బిగ్‌బాస్ అన్నాడు. వెళ్లేముందు పక్క బాక్స్‌లో ఏముందో చూడాలనుకుంటున్నారా అని బిగ్‌బాస్ అడగడంతో అవును అంటూ క్లాత్ తీశాడు అర్జున్. తీరా అందులో ఐదు ఉల్లిపాయలు చూసి వామ్మో అనుకున్నాడు అర్జున్. ఇక ఆ ఘాటుకి తట్టుకోలేక స్వీట్‌గా ఏమైనా ఇవ్వొచ్చుగా బిగ్‌బాస్.. అంటూ అర్జున్ అడిగాడు. కేకు పంపించమంటారా అని బిగ్ బాస్ అనగానే.. వామ్మో వద్దయ్యా.. ఇక్కడి నుంచి వెళ్లేవరకు ఇక స్వీట్ కూడా అడగను బిగ్‌బాస్ అంటూ దండం పెట్టేశాడు అర్జున్.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.