English | Telugu

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పై కోపం ? ఎవరికంటే ...

నటుడు, పాటగాడు, గుప్పెడంత మనసు సీరియల్ మెయిన్ రోల్ లో నటిస్తున్న మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ కి కాంగ్రెస్ పార్టీ మీద కోపం వచ్చింది. తెలంగాణ పాలిటిక్స్ మంచి హాట్ హాట్ గా సాగాయి నిన్న మొన్నటి వరకు.. ఎన్నికల ప్రచారం, ఫలితాలు, ఏ పార్టీ గెలుస్తుందా అంటూ ఎదురు చూపులు...చివరికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిసాక ఎవరు సీఎం కాబోతున్నారు అనే విషయం మీద మంతనాలు...వీటికి తెర వేస్తూ రేవంత్ రెడ్డిని రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించబోతోంది కాంగ్రెస్ అధిష్టానం.

ఐతే కాంగ్రెస్ పార్టీ మీద చాల మందికి అంత సదభిప్రాయం లేదు..ఐతే కర్ణాటక సీఎం డికె శివకుమార్ మీద సాయి కిరణ్ కి కోపం వచ్చింది. "తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి తలదూర్చడానికి డికె శివకుమార్ అసలు ఎవరు ? కాంగ్రెస్ పార్టీతో వచ్చే పెద్ద సమస్య ఇదే. కాంగ్రెస్ పార్టీ ఉండే ఇతర రాష్ట్రాల నేతలంతా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు" అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఒక పోస్ట్ పెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వ్యూహాలు తెలంగాణలో అద్భుతంగా పని చేశాయన్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోని అసంతృప్తులను డీకే శివకుమార్ బుజ్జగించి ఎలా లైన్ లోకి తీసుకొచ్చారో మనం చూసాం. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. బెంగళూరు వేదికగా పరిష్కరించడంలో డీకే మార్క్ ప్రభావితం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది మొదలు రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవరకు డికె శివకుమార్ పాత్ర చాల ఎక్కువ...ఈ పాటి రాజకీయం చేయడం మన తెలంగాణ నేతలకు తెలీదా అన్నట్టుగా ఉంది సాయికిరణ్ పోస్ట్.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.