English | Telugu
పులితో పోరి..జబర్దస్త్ ఫోటోతో ఇన్స్టాలో వైరల్
Updated : Jan 9, 2024
జోర్దార్ సుజాత-రాకింగ్ రాకేష్ జోడి గురించి వాళ్ళ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో వీళ్ళ కామెడీ స్కిట్స్ మాములుగా ఉండవు. మొదట్లో ఎవరికి వారు విడివిడిగా చేసేవాళ్ళు..కానీ పెళ్లయ్యాక ఇద్దరూ కలిసే స్కిట్స్ చేస్తున్నారు. ఇక వీళ్ళ జోడి ఫారెన్ టూర్స్ వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ పిక్స్ ని వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జోర్దార్ సుజాత అలాంటి ఒక భయపడే పిక్ ని పెట్టింది. సుజాత జూకి వెళ్ళింది..
ఇక అక్కడ ఒక పులి చాలా ఆరాంగా రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఇక సుజాత దాని పక్కకు వెళ్లి నిలబడి ఫొటోస్ దిగింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "వీడియో లాస్ట్ లో చూడండి..అంత భయం..ఐనా సరే ఫోటో, వీడియోస్ తీసుకున్నా" అంటూ "థ్యాంక్ ఫుల్ మై మొగుడుగారు" అనే హాష్ టాగ్స్ పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే "మేము దాని దగ్గరకు కూడా పోము.. అక్కా అది నాన్ - వెజ్ చప్పరించేస్తుంది జాగ్రత్త" అంటూ కామెంట్స్ పెట్టారు.
జోర్దార్ సుజాత రీల్స్ అవీ బాగా చేస్తూ ఉంటుంది. రాకేష్ కి కాస్త దైవ భక్తి ఎక్కువ.. టెంపుల్స్ కి వెళ్లిన వీడియోస్ ని టూర్స్ కి వెళ్లిన వీడియోస్ ని కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అప్పుడప్పుడు మంత్రి రోజా ఇంటికి వెళ్లి సరదాగా సందడి చేస్తూ ఉంటారు అలాగే ఆమె కూడా వీళ్ళను వెంటబెట్టుకుని తిరుపతికి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం కూడా దగ్గరుండి చేయిస్తారు. అలాగే రాకేష్ లైఫ్ లో ఎదగడానికి ఇల్లు కూడా కొనుక్కోవడానికి నాగబాబు కూడా ఎంతో గైడ్ చేసారని రాకేష్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.