English | Telugu

థమన్ తో వెంకటేష్ కి చెక్ ఇప్పించిన రాహుల్...


స్టార్ మాలో సూపర్ సింగర్ ప్రతీ వారం దుమ్ము దులిపేస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇంకా ఈ షోకి థమన్ ఎంట్రీ ఇచ్చి అందరిలో జోష్ నింపారు. ఇక షోలో రాహుల్ సిప్లిగంజ్ తన మనసులో బాధను బయట పెట్టారు. ఒక కంటెస్టెంట్ "అల వైకుంఠపురంలో" అనే మూవీ నుంచి "రాములో రాములా" సాంగ్ పాడేసరికి రాహుల్ ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని ఈ సందర్భంగా షేర్ చేసుకున్నారు. "ఇవ్వాళ్టికి కూడా ఈ సాంగ్ వింటున్నప్పుడల్లా రిగ్రెట్ అవుతూ ఉంటా..అరె బిగ్ బాస్ హౌస్ నుంచి కొంచెం ముందే ఎలిమినేట్ అయ్యుంటే ఈ సాంగ్ నాకు దొరికి ఉండేదని" అని చెప్పి ఆ పాట పాడి వినిపించాడు.

"నిజంగా ఈ సాంగ్ లో నేను రాహుల్ ని చాలా మిస్ అయ్యాను..నేను నాగార్జున గారికి తప్ప మిగతా అందరికీ ఫోన్ చేసాను ఎలాగైనా సరే రాహుల్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేయండి అని" అంటూ థమన్ కూడా ఆనాటి మెమొరీస్ ని షేర్ చేసుకున్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్..హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా తన సాంగ్స్ తో హౌస్ మేట్స్ ని ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసేవాడు. ఇకపోతే ఈ సూపర్ సింగర్ షోలో లాస్ట్ వీక్ వెంకటేష్ అనే డెలివరీ బాయ్ కంటెస్టెంట్ కస్టాలు విన్న రాహుల్ అతని మ్యూజిక్ క్లాసెస్ కోసం ఏదైతే ఒక లక్ష చెక్ ఇస్తానని మాటిచ్చాడో రాహుల్ చిచ్ఛ అది నెరవేర్చుకున్నారు. ఈ షోకి గెస్ట్ గా వచ్చిన థమన్ తో ఆ చెక్ ని ఇప్పిస్తే వెంకటేష్ కి కూడా మంచి బ్లెస్సింగ్ లా ఉంటుంది అని భావించి ఆయన చేతుల మీదుగా ఈ చెక్ ఇచ్చే ఏర్పాటు చేసాడు రాహుల్. ఇక నెక్స్ట్ వీక్ సంక్రాంతి సందర్భంగా డిఎస్పి అండ్ థమన్ సాంగ్స్ పాడాలంటూ థీమ్ ఇచ్చింది శ్రీముఖి.