English | Telugu

రన్నర్ గా వచ్చాడు కానీ విన్నర్ వాడే!

అమర్ బిగ్ బాస్ లోకి రాకముందు 'జానకి కలగనలేదు' సీరియల్ లో రాముగా మాత్రమే పరిచయం. బిగ్ బాస్ తర్వాత కోట్లాది ప్రేక్షకులకు అమర్ దీపు చౌదరి గా సూపరిచితుడయ్యాడు. హౌస్ లో ఎన్ని ఫౌల్స్ అడిన నాగార్జునతో వరుసగా చివాట్లు పడిన తన స్టైల్ లో ఎలాంటి మార్పు రాలేదు. నామినేషన్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ తో బిగ్ ఫైట్ ద్వారా అమర్ గ్రాఫ్ టోటల్ గా పడిపోయింది. ఆ తర్వాత హౌస్ లో రైతు బిడ్డ బీటెక్ బిడ్డ అంటూ వివక్ష మొదలు కాగా బయట కూడా అలాగే వార్ మొదలైంది. అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మధ్య నెట్టింట పెద్ద యుద్ధమే జరిగింది.

అమర్ భార్య తేజస్విని గౌడ అందరికి సూపరిచితమే. తన భర్తని ఇంటర్వూ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ ఇంటర్వూకి విశేష స్పందన లభిస్తుంది. అందులో అమర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ సీజన్ అనేది నిజంగానే ఉల్టా పుల్టా నన్ను అందరు ముందు నుండి బ్యాడ్ బాయ్ లాగే చూసారు. సరే అలాగే అనుకుంటున్నారు కదా అని నేను కూడా అలాగే ఉండడం స్టార్ట్ చేసానని అమర్ అన్నాడు. రవితేజ గారు వచ్చినప్పుడు నువ్వు ఒక్క నిమిషం ఆలోచించకుండా రావడానికి సిద్ధం అయ్యావు. నాకు నువ్వు బయటకు వచ్చేస్తున్నావని బాధకాదు.. నీకు అ హీరో అంటే ఎంత ఇష్టమేనని చూసి ఏడ్చాను అని తేజస్విని అనగానే.. నేను అప్పుడే ఫ్యాన్ బాయ్ గా గెలిచాను. అప్పుడే నేను విన్నర్ అయిపోయానని అమర్ చెప్పుకొచ్చాడు. ఇలా హౌస్ లో ప్రతిది టాస్క్ కి సంబంధించిన తన అనుభవాలని అమర్ దీప్ షేర్ చేసుకున్నాడు.

అ తర్వాత అమర్, తేజస్విని వాళ్ళతో పాటు అరియానా, జస్వంత్ కూడా జాయిన్ అయ్యారు. అమర్ గురించి తన ఫ్రెండ్ షిప్ బాండింగ్ గురించి అరియాన చెప్పుకొచ్చింది. అమర్ దీప్ కి కాబోయే వైఫ్ ఎలా ఉంటుందో మా ఫ్రెండ్ షిప్ ని అర్థం చేసుకుంటుందో లేదో అనుకున్న కానీ తేజు వెరీ క్యూట్ అంటూ అరియాన అంది. అమర్ కూడా అరియానా ఫ్రెండ్ షిప్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. అలాగే జస్వంత్ అమర్ అటతీరు గురించి చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇచ్చిన అనుభవాలని అమర్ దీప్ షేర్ చేసుకున్నాడు.‌ కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.