English | Telugu

ఆ కుర్చీని మడతబెట్టిన నయని, యావర్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఒక్కటే మ్యూజిక్.. అదే ఆ కుర్చీని మడతబెట్టి పాట. ఆ తాత ఏ ముహూర్తాన కుర్చీ మడతపెట్టాడో కానీ అప్పటి నుంచి ఇది ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక దీన్ని ఏకంగా సినిమాలో పెట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంకా అదిరిపోయే బీట్ ఇస్తూ గట్టిగా కుర్చీని మడతబెట్టేశాడు. ఇక ఆన్ స్జ్రీన్ మీద ఈ పాటకి మహేశ్ బాబు-శ్రీలీల వేసిన స్టెప్పులు అయితే ఫ్యాన్స్‌ని పిచ్చెక్కించేశాయి. ఇంకేముంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చిన్న చిన్న సెలబ్రిటీల నుండి పెద్ద ఆర్టిస్ట్ ల దాకా ఈ పాటకి స్టెప్పులేస్తూ రీల్స్ షేర్ చేస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తమ ఆటతీరు, మాటతీరుతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న యావర్, నయని పావని కలిసి ఈ పాటకి చిందలేశారు.బాస్ 2.0 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాద్ అమ్మాయి నయని పావని. ఈ అమ్మడు పెద్దగా పరిచయం లేని పేరే. కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా అంత ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకోలేకపోయింది. ఢీ-14 షో కి వచ్చిన నయని.. కమెడియన్ హైపర్ ఆదితో కలిసి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది. టిక్ టాక్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది నయని. తను పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే... నయనీకీ డాన్స్, షాపింగ్ అంటే ఇష్టమంట. నయని కలహం, మధురం అనే వెబ్ సిరీస్ లలో నటించింది. అదేవిధంగా సూర్యకాంతం మూవీలో హీరోయిన్ కి స్నేహితురాలిగా నటించింది నయని. సోషల్ మీడియా లో రెగ్యులర్ గా ఫోటలతో, రీల్స్ తో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది.

ఇప్పటికే తనకి ఇన్ స్ట్రాగ్రామ్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉండగా, బిగ్ బాస్ ఎంట్రీ ద్వారా మరింత ఫేమ్ సంపాదించుకోవాలని వెళ్ళింది. 2.0 లో ఎంట్రీ ఇచ్చిన నయని.. లోపల ఉన్నవాళ్ళ ఆటతీరుకి, బయట ప్రేక్షకుల స్పందననలని అన్నింటిని అనాలసిస్ చేసి వెళ్లింది. భారీ అంచనాల మధ్య ఎంట్రీ ఇచ్చిన ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ నయని.. హౌజ్ లోకి వెళ్ళి వారం రోజుల్లో‌ బయటకి వచ్చేసింది కానీ ఎంతో ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. కాగా నయని పావని, ప్రిన్స్ యావర్‌తో కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్‌కి స్టెప్పులేసింది. ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.