English | Telugu

కియా కారుతో రోహిణి..త్వరలో ల్యాండ్ కూడా కొనుక్కుంటాను


జబర్దస్త్ రోహిణి గురించి ఆమె కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది రోహిణి కూడా ఒకరు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి కమెడియన్ రోహిణిగా పేరు మార్చుకొని తన జర్నీని ఇంకా పెంచుకుంటూ వెళ్ళింది. సీరియల్స్ లో నటించినా రాని పాపులారిటీ జబర్దస్త్ షోలోకి లేడీ కమెడియన్ గా వచ్చాక బాగా హైలైట్ అయ్యింది. ఈ పాపులారిటీ వలన ఆమెకు మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయి... మత్తు వదలరా , బలగం, సేవ్ ది టైగర్స్ వంటి మూవీస్ తో పాటు పలు రకాల వెబ్ సిరీస్ లో నటించింది. తర్వాత రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా వెళ్లి ఎంటర్టైన్ చేసింది. అలాంటి రోహిణి ఇప్పుడు కియా కార్ కొనుక్కుంది. ఇక ఆ కార్ తో తీసుకున్న పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది.

ఇంతకు ముందు వాళ్ళ నాన్నకు బైక్ కొని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇప్పుడు కార్ కూడా కొనేసింది. కొత్త కార్ తో కొత్త సంవత్సరం బోణి కొట్టింది రోహిణి. ఇక ఈమెకు అందరూ విషెస్ చెప్తున్నారు..చైత్రా రాయ్, అష్షు రెడ్డి, ఆకర్ష్, జ్యోతక్క, అమరదీప్ వంటి వాళ్లంతా రోహిణికి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. ఇక రోహిణి కొన్న కార్ పేరు కియా సెల్టోస్ జిటిఎక్స్ ప్లస్. ఇక ఈ కార్ కి పూజ కూడా చేయించింది రోహిణి. మొదట కొన్న కార్ ఆక్సిడెంట్ లో పాడైపోయింది, రెండో కార్ రోహిణి అమ్మేసిందింది ఇప్పుడు మూడో కార్ ని రూ .25 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నట్లు చెప్పింది. ఇక త్వరలో ల్యాండ్ కూడా కొనుక్కుంటున్నట్లు కూడా చెప్పింది రోహిణి..

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.