English | Telugu
జీవిత అగ్గిపెట్టెలాంటిది రాజశేఖర్ కౌంటర్...
Updated : Jan 9, 2024
సంక్రాంతి సందడి ఆల్రెడీ బుల్లితెర మీద మొదలైపోయింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులకు సరిపడా ఎంటర్టైన్మెంట్ అందించి ఈవెంట్స్ ని రెడీ చేసేశాయి చానెల్స్.. వాటి ప్రోమోస్ ని నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు జీ తెలుగులో జనవరి 14 న సాయంత్రం 6 గంటలకు "పండగంటే ఇట్టా ఉండాలా" అనే షోని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది.
ఇక ఈ షోకి జీవిత రాజశేఖర్ వచ్చారు. గుప్పెడంత మనసు సీరియల్ లో లీడ్ రోల్ లో నటించిన మహేంద్ర అలియాస్ సాయి కిరణ్ కూడా వచ్చి రాజశేఖర్ మీద పేరడీ పాటందుకున్నారు. ఆ పాట విన్న జీవిత వార్నింగ్ కూడా ఇచ్చారు. "రాజశేఖర్ అని నా క్లోజ్ ఫ్రెండు, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు..." అని రెండు లైన్స్ పాడారు సాయి కిరణ్ ..వెంటనే జీవిత మైక్ తీసుకుని "ఎవరన్నా ఆడపిల్లలు వెంటపడ్డారని, ఐ లవ్ యు చెప్పారని అనండి..కాళ్ళు , చేతులు ఇరగ్గొడతా" అన్నారు. దానికి రాజశేఖర్ "డోంట్ మ్యారి, బి హ్యాపీ" అంటూ పాటందుకున్నారు. తర్వాత సాయికిరణ్ "జీవిత గారు అగ్గిపుల్ల లాంటి అమ్మాయని మనందరికీ తెలుసు" అనేసరికి "అగ్గిపుల్లనా అగ్గిపెట్టెనా" అంటూ రాజశేఖర్ కౌంటర్ వేసాడు. ఇక ఈ షోకి హోస్ట్ గా రవి, వర్షిణి వున్నారు. ఇక నెటిజన్స్ మాత్రం సాయి కిరణ్ గారు మీ సింగింగ్ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజశేఖర్ వేసిన డైలాగ్స్ కి హోస్ట్ రవి పడీ పడీ నవ్వేసాడు..."సర్ టైమింగ్ భయ్యా మాములుగా లేదు" అంటూ కామెంట్ చేసాడు. ఇలా జీ తెలుగు సంక్రాంతిని స్పెషల్ గా మార్చడానికి వచ్చేస్తున్నారు వీళ్లంతా.