English | Telugu

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ తో  లావ‌ణ్య త్రిపాఠి వెబ్ సిరీస్

అభిజిత్ అని చెప్తే ఎవరూ గుర్తుపట్టారు కానీ బిగ్ బాస్ సీజన్ 4 అభి అంటే గతంలోకి వెళ్లి మరీ గుర్తుచేసుకుంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ లా బిహేవ్ చేసి ఒక స్టైలిష్ ఆటిట్యూడ్ తో అఖిల్ తో పోటీ పడి మరీ టైటిల్ విన్ ఐన అభి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఈ సీజన్ విన్నర్‌ ఐన  తర్వాత అభిజిత్‌కి ఇండస్ట్రీ నుంచి చాల ఆఫర్స్ వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. ట్రావెలింగ్‌లో బిజీగా ఉండే అభి తన ఫ్యాన్స్‌కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. తన లేటెస్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఆ పోస్టర్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.