English | Telugu

మీనాకి సలహా ఇచ్చిన రజనీకాంత్..సూపర్ జోడి డాన్స్ షో త్వరలో

జీ తెలుగులో త్వరలో కొత్త డాన్స్ షో రాబోతోంది. సూపర్ జోడి పేరుతో ఈ షో మంచి కలర్ ఫుల్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లో రాబోతోంది. దానికి సంబంధించిన ఒక ప్రోమో కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక ఈ "సూపర్ జోడి" డాన్స్ షోకి జడ్జిగా అందాల నటి మీనా రాబోతోంది. తెలుగు, తమిళ్ లో మంచి మంచి సినిమాలు చేస్తున్న మీనా.. గతంలో జబర్దస్త్ షోకు జడ్జిగా వస్తూ అలరిస్తూ ఉండేది. ఇప్పుడు సూపర్ జోడీ డాన్స్ షోకి జడ్జిగా వస్తోంది.

"సెలబ్రిటీ రీల్ వర్సెస్ రియల్ కపుల్స్ " తో రాబోతోంది ఈ షో. ఈ ప్రోమో వెరైటీగా డిజైన్ చేసారు మేకర్స్. మీనా ఇంట్లో క్లీన్ చేసుకుంటూ "సోమవారం నుంచి శనివారం వరకు డైలీ సీరియల్ లా మా ఆడవాళ్లకు ఇల్లు, పని సరిపోతుంది. సండే కూడా ఫన్ లేదు. ఆడడానికి, చూడడానికి లేదు" అని అసహనంతో తాను సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించిన ముత్తు మూవీకి చెందిన అవార్డు వైపు తన్మయత్వంగా చూసుకుంటూ ఉంటుంది.

అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో రజనీకాంత్ వాయిస్ వినిపించింది "మీనా ఎంటర్టైన్మెంట్ కి గ్యాప్ ఉండకూడదు ఆపొద్దు..డోంట్ స్టాప్ రిపీటు అనేసరికి ముత్తు మ్యూజిక్ లో లీనమైపోయి మీనా సూపర్ జోడి డాన్స్ షో స్టేజి మీదకు మెగా జడ్జిగా వచ్చేస్తుంది. డాన్స్ మన జీవితాల్లో ఉంది, డాన్స్ మనల్ని దగ్గర చేస్తుంది ..ఇక ఈ షోలో 8 సెలబ్రిటీ జోడీస్, ఒక టైటిల్ విన్నర్ ..త్వరలో రాబోతోంది" అంటూ సూపర్ జోడి లింక్ ని అనౌన్స్ చేసింది మీనా. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా రిఎంట్రీస్ ఇస్తూ ఈ జనరేషన్ స్టార్స్ తో పోటీగా పని చేస్తున్నారు. వారిలో ఆల్రెడీ రాధ, ఇంద్రజ, కృష్ణ భగవాన్, ఆమని ఇలాంటి వాళ్లంతా ఉన్నారు. వీళ్ళ దారిలోనే ఇప్పుడు మీనా కూడా వచ్చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.