English | Telugu
రైతులకోసం మరోసారి పల్లవి ప్రశాంత్.. త్వరలో మీ ముందుకు!
Updated : Jan 9, 2024
జై జవాన్.. జై కిసాన్, రైతే రాజు.. ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించిన పేరు. బుల్లితెర ధారావాహికలతో పోటీగా రియాలిటీ షోలు రాజ్యమేలుతున్న ఈ సమయంలో.. బిగ్ బాస్ పెనుచంచలనంగా మారిన విషయం అందరికి తెలిసిందే. ఎంతో ఆదరణ పొందిన బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తిచేసుకోగా.. ఏడో సీజన్ కూడా పూర్తిచేసుకుంది. ఇందులో కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలతో పోటీ పడీ రైతు తల్చుకుంటే ఏదైన సాధించగలడని నిరూపిస్తానని చెప్పాడు.. చేసి చూపించాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టాడు ప్రశాంత్. మొదట్లో అందరు రైతుల పేరు చెప్పుకొని కావాలని నటిస్తున్నాడని అన్నారు. కానీ రోజులు గడిచేకొద్దీ అతని పట్టుదల, గెలవాలనే కసి, ప్రతీ టాస్క్ అతను చూపే ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రతీ ఒక్క బిగ్ బాస్ అభిమానికి కనెక్ట్ అయ్యాయి. హౌస్ లో అందరితో ఒకేలా ఉన్న ప్రశాంత్‌కి శివాజీ తన సపోర్ట్ ఇచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలో చెప్పాడు. ఇక హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. అందరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాకపోవడంతో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎదురుచూసాడంట ప్రశాంత్. శోభాశెట్టి, ప్రియాంక తినమని చెప్పిన తినని మొండిగా ఉన్నాడంట ప్రశాంత్. ఆ తర్వాత బంతిపూలని పంపించాడు బిగ్ బాస్. ఆ పూలని చూసిన శివాజీ.. ' రేయ్ పల్లవి.. మీ చేనులో పూసిన బంతిపూలు రా' అని చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక కాసేపటికి.. బాబు బంగారం అంటూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాన్నని చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి కాళ్ళమీద పడిపోయాడు ప్రశాంత్. నాన్నని పైకి ఎత్తుకొని.. జై కిసాన్ జై జవాన్. మళ్లొచ్చిన అంటే తగ్గేదేలే అంటూ అరవడంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. నా బిడ్డని మంచిగా చూసుకోండ్రి అని హౌస్ మేట్స్ అందరికి చేతులెక్కి మరీ మొక్కాడు. " గొడవలు పెట్టుకోకండి. కొట్టుకోకండి.. కలిసి మెలిసి ఉండండి" అంటూ అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అన్నాడు. ఇక నాన్నకి ఆప్యాయంగా అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. ఓ ప్లేట్ లో అన్నం మెతుకుల్లా మీరంతా కలిసి మెలిసి ఉండాలే. ఎవరి ఆట వారిదే. ఆట అయిపోయాక అంతా మరిచిపోయి కుటుంబం మాదిరి ఉండాలని హౌస్ మేట్స్ తో అన్నాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న.
అయితే ఇప్పుడు తాజాగా ప్రశాంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేశాడు. నేను గెలిచానంటే దానికి మీరంతా సపోర్ట్ గా నిలవడం వల్లే.. మీరే లేకుంటే నేను ఇప్పుడు ఈ కప్ గెలిచేవాడినే కాదు. రైతులు ఏదైనా సాధిస్తారని, ఏ రంగంలోనైనా రాణించగలరని నాకు సపోర్ట్ చేసిన ఎంతోమందికి థాంక్స్. చాలా వీడియోలు చూసాను. కొందరు సైకిల్ యాత్ర అని, పాదయాత్ర అని చేశారు. వాళ్ళందరికి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నాను. కొన్ని కారణాల వల్ల మీ అందరిని కలవలేకపోయాను. కొన్ని దేవుళ్లకి మొక్కులు ఉండే అవన్నీ తీర్చుకొని మీ అందరిని కలుస్తాను. నేను ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే నన్ను క్షమించండి అని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.