English | Telugu
Krishna Mukunda Murari:తను ఏడిస్తే శోభనం వద్దని చెప్పిన తింగరి పిల్ల !
Updated : Jan 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -370 లో.. కృష్ణని శోభనం కోసం అందంగా ముస్తాబు చేస్తుంది ముకుంద. ఈ ముచ్చట ఎప్పుడో జరగాల్సింది. పాపం ఈ తింగరి చాలా కష్టాలు అనుభవించిందని రేవతి తన మనసులో అనుకుంటుంది. కృష్ణని రెడీ చేసినందుకు ముకుందకి రేవతి థాంక్స్ చెప్పబోతుంటే.. వద్దు అత్తయ్య నా తప్పుకి ఇది ప్రాయఛ్చితమని ముకుంద అంటుంది.
ఆ తర్వాత ముకుంద అక్కడ నుండి వెళ్ళాక.. ఈ క్షణం వరకు ముకుంద మారిపోయిందంటే నేను నమ్మలేక పోయానని రేవతి అనగానే.. లేదు అత్తయ్య ముకుంద పూర్తిగా మారిపోయింది నేను చెప్తున్నా కాదా అని కృష్ణ అంటుంది. మరొకవైపు నందు శోభనం గది డెకరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మురారి దగ్గరికి మధు, గౌతమ్ లు వచ్చి మాట్లాడతారు. మీరు కష్టపడి మా పెళ్లి చేశారు కానీ ఇన్ని రోజులు మీరు ప్రాబ్లమ్స్ లో ఉన్నా.. మేం ఏం చెయ్యలేకపోయమని గౌతమ్ అంటాడు. ఆ తర్వాత మురారి గదిలోకి వెళ్లి కృష్ణ కోసం ఎదురుచూస్తుంటాడు. కృష్ణ భవాని దగ్గర ఆశీర్వాదం తీసుకొని మురారి దగ్గరికి వెళ్ళబోతు.. ముకుంద ఎక్కడ అని అడుగుతుంది. ముకుంద ఏడుస్తూ కన్పించడంతో.. ఇప్పుడు నేను ఏసీపీ సర్ దగ్గరికి వెళ్ళను. ముకుంద బాధగా ఉంటే నేను సంతోషంగా ఉండలేనని కృష్ణ అనగానే అందరు ఆశ్చర్యపోతారు. అప్పుడే భవాని వచ్చి దానికి దీనికి సంబంధం ఏం లేదు నువ్వు వెళ్ళు అని భవాని చెప్పినా.. కృష్ణ వినదు మురారిని కిందకి పిలుస్తుంది. మురారి కూడా కృష్ణలాగే మాట్లాడతాడు.
ఆ తర్వాత ఆదర్శ్ వచ్చాక ముకుంద జీవితం బాగుంటుంది. అప్పుడు ముహూర్తం పెట్టుకుందామని కృష్ణ అనగానే.. మీ ఇష్టం కానీ ఆదర్శ్ వచ్చాక పరిణామాలకి నువ్వే బాధ్యత అని కృష్ణతో భవాని చెప్తుంది. దాంతో కృష్ణ సరేనంటుంది. రేవతి మాత్రం కృష్ణపై చాలా కోపంగా ఉంటుంది. ఆ తర్వాత ముకుంద దగ్గరికి కృష్ణ వెళ్లి ఇప్పుడు శోభనం జరగడం లేదు.. అందరికి చెప్పానని కృష్ణ చెప్తుంది.మరుసటి రోజు ఉదయం కృష్ణ నిద్ర లేచి పాపం ఏసీపీ సర్ ని డిస్సపాయింట్ చేశానని అనుకుంటుంది. ఇప్పుడు రేవతి అత్తయ్య నాపై చాలా కోపంగా ఉందని కృష్ణ అనుకుంటుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి ఆదర్శ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కృష్ణ ఏంటి ఆదర్శ్ ని తీసుకొని వస్తానని అంత కాన్ఫిడెంట్ గా చెప్తుందని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.