English | Telugu

చైనాలో ఫేమస్ పాట పాడి అలరించిన నవ్యస్వామి

చైనాలో ఫేమస్ పాట పాడి అలరించిన నవ్యస్వామి

శ్రావణమాసం వచ్చిందంటే చాలు బుల్లితెర మీద ఆ పాజిటివ్ వైబ్స్, స్పెషల్ ఈవెంట్స్ కి లెక్కేలేదు. ఎందుకంటే ఈ మాసం అంతా పండగలే  పండగలు కాబట్టి. ఇప్పుడు డ్రామా జూనియర్స్ 6 లో శ్రావణ మాసం కళకళలాడింది. నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి  "బెదురులంక" మూవీ టీమ్ "కార్తికేయ - నేహశెట్టి" ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఐశ్వర్య, అంజనా, నవ్య స్వామితో పాటు జడ్జెస్  శ్రీదేవి , జయప్రద, బాబుమోహన్ వచ్చి ఆడియన్స్ కి  శ్రావణమాస శుభాకాంక్షలు చెప్పారు. ఇక యాంకర్ ప్రదీప్ జోక్స్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు కదా " జయప్రద గారు మీరేమి కోరుకున్నారు" అని అడిగేసరికి "ప్రదీప్ గురించే కోరుకున్నా" అన్న ఆమె  మాటకు వచ్చిన ఫన్నీ కన్నీళ్లను తుడుచుకుని జోక్స్ వేసాడు. "నా గురించి కూడా కోరుకునే వాళ్లున్నారా అమ్మా" అని కౌంటర్ వేసాడు.